Shane Warne: క్రికెట్‌ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్‌ వార్న్‌

Records Held By Australian Legendary Leg Spinner Shane Warne - Sakshi

క్రికెట్‌ చరిత్రలో ఆటగాళ్లు ఎందరో ఉంటారు.. కానీ తమ ఆటతో ప్రత్యర్థులనే ఓ ఆటాడించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని లెజెండ్‌గా మారేది మాత్రం కొందరే. అటువంటి దిగ్గజ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్పిన్నింగ్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్న్‌ తన క్రికెట్‌ చరిత్రలో ఎన్నో మైలురాయిలు అధిగమించాడు. అలానే చెరిగిపోని రికార్డులు మరెన్నో తన పేరుమీద లిఖించుకున్నాడు. 

ఇలాంటివి బోలెడు ఉన్నా షేన్‌ వార్న్‌కి క్రికెట్‌ కెరీర్‌లో మర్చిపోలేని రోజు ఏదైనా ఉందంటే 2006 ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 700వ వికెట్‌ సాధించడమనే చెప్పాలి. విక్టోరియన్ గ్రౌండ్‌లో 89,155 మంది ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్‌ తీసి అంతవరకు ఎవరికీ సాధ్యపడని ఘనతను సాధించి చూపాడు. ఆ వికెట్‌తో ప్రపంచ క్రికెట్‌ చరిత్రోలో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం అదే మ్యాచ్‌లో వార్న్ నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు తన టెస్ట్ కెరీర్‌లో ఐదు వికెట్లను పడగొట్టడం ద్వారా 37వ చివరి ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top