
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. క్రికెట్‌లో అద్భుత కెరీర్ చూపిస్తానని నమ్మించి.. రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో జైపూర్ పోలీసులు యశ్ దయాల్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాల వయస్సు 19 ఏళ్లని, దయాల్‌కు పరిచియమైనప్పుడు మాత్రం ఆమె మైనర్ అని పోలీసులు వెల్లడించారు. జైపుర్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తొలిసారి తాను యశ్ దయాల్‌ను కలిసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఐపీఎల్-2025 సందర్భంగా కూడా దయాల్ తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఏప్రిల్ 13న ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ జట్లు జైపూర్‌లో తలపడ్డాయి. ఈ క్రమంలో దయాల్ జైపూర్‌కు వచ్చినప్పుడు బాధితురాలిని సీతాపుర హోటల్‌కు పిలిపించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎఫ్‌ఐర్‌లో నమోదైంది.
అతడిపై ఈ నెల 23న పోలీసులకు సదరు యువతి ఫిర్యాదు చేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా ఈ ఆర్సీబీ ఆటగాడిపై ఇప్పటికే ఓ లైంగిక వేదింపుల కేసు నమోదైంది. ఇటీవలే ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి దయాల్‌పై ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో అతడి అరెస్టుపై అలహాబాద్ హైకోర్టుపై స్టే విధించింది.
చదవండి: అది నా చేతుల్లో లేదు.. అంతా కెప్టెన్ ఇష్టమే: శార్ధూల్ ఠాకూర్