
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుంటున్నాడు. జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ చెమట చిందిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే జడేజా, తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు. వీటితో పాటు తన సరికొత్త మేకోవర్ ఫొటోను కూడా జడ్డూ భాయ్ షేర్ చేశాడు. ‘‘నిబంధనలు అన్నీ పక్కన పెట్టేయండి. మీకు నచ్చినట్లుగా తయారవ్వండి. మంచిగా డ్రెస్ చేసుకోండి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించండి’ ’ అంటూ తన ఫాలోవర్లకు సూచించాడు. ఈ నేపథ్యంలో జడేజా పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తోందని, త్వరలోనే తనను మైదానంలో చూసే అవకాశం ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా మూడో టెస్టు సందర్భంగా జడేజా బొటనవేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. ఇక జడ్డూ భాయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అదే జోష్‌లో మొటేరా వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులోనూ మొత్తంగా 11 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు. నాలుగో టెస్టులోనూ ప్రభావం చూపుతున్నాడు. దీంతో జడేజా జట్టులో లేని లోటు పెద్దగా కనిపించడం లేదు.
చదవండి: గిల్ ఇలాగే ఆడావో.. రాహుల్, అగర్వాల్ వచ్చేస్తారు!
Hustling On 👊💪 #comingbackstronger #trainhard pic.twitter.com/lw6x1w26xe
— Ravindrasinh jadeja (@imjadeja) March 3, 2021
All started 💪🏻 pic.twitter.com/TyjvZ47ESx
— Ravindrasinh jadeja (@imjadeja) March 4, 2021