ధోని ఫినిషింగ్ ట‌చ్‌కు జ‌డేజా ఫిదా.. ఏం చేశాడంటే.. ? | Ravindra Jadeja Bows To MS Dhoni After Match Winning Knock vs Mumbai Indians | Sakshi
Sakshi News home page

IPL 2022: ధోని ఫినిషింగ్ ట‌చ్‌కు జ‌డేజా ఫిదా.. ఏం చేశాడంటే.. ?

Apr 22 2022 7:39 PM | Updated on Apr 22 2022 8:07 PM

Ravindra Jadeja Bows To MS Dhoni After Match Winning Knock vs Mumbai Indians - Sakshi

PC: IPLcom

ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత పోరులో సీఎస్‌కే విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే సీఎస్‌కే విజ‌యానికి అఖ‌రి 4 బంతుల్లో 16 పరుగులు అవసరమవగా మహేంద్రసింగ్ ధోనీ వరుసగా 6, 4, 2, 4 బాది జ‌ట్టును గెలిపించాడు. ఇక త‌న స్టైల్లో మ్యాచ్‌ను ఫినిష్ చేసి డగౌట్‌కి తిరిగొస్తున్న ధోనీకి విజ‌యోత్సవంలో ఉన్న కెప్టెన్ జ‌డేజా ఎదురెళ్లి.. క్యాప్ తీసేసి వంగి మరీ ధోనీకి నమస్కరించాడు.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంత‌రం 156 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రాయుడు(40), రాబిన్  ఊత‌ప్ప(30) ప‌రుగులతో రాణించగా.. అఖ‌రిలో ధోని ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చి జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు.

చ‌ద‌వండి: IPL 2022: రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement