Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం!

Ranji Trophy: Surya Continues Run Hits 95 Fans Says Get Test Call Surely - Sakshi

Suryakumar Yadav- Ranji Trophy 2022-23 - Mumbai vs Saurashtra Day 2: అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రమే లక్ష్యంగా రంజీ బరిలో దిగిన టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమర్‌ యాదవ్‌ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా ముంబై తరఫున  హైదరాబాద్‌తో తొలి మ్యాచ్‌ ఆడాడు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌. 

ఈ క్రమంలో 80 బంతుల్లోనే 15 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 90 పరుగులు(112 స్ట్రైక్‌రేటు) చేశాడు. ఇక సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ సూర్య రాణించాడు. మొత్తంగా 107 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 95 పరుగులు సాధించాడు. 

జట్టును ఆదుకున్న సూర్య!
కాగా మంగళవారం మొదలైన టెస్టులో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై.. సౌరాష్ట్రను 289 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగి 230 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ ముగించింది ముంబై. ఓపెనర్లు పృథ్వీ షా(4), యశస్వి జైశ్వాల్‌(2) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చి సూర్య జట్టును ఆదుకున్నాడు.

విలువైన 95 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసిన కెప్టెన్‌ అజింక్య రహానే(24) నిరాశపరచగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ 75 పరుగులతో రాణించాడు. మిగిలిన వాళ్లలో ముషీర్‌ ఖాన్‌ 12 పరుగులు తప్ప మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.

అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర బ్యాటర్లకు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో బుధవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి సౌరాష్ట్ర 120 పరుగులు చేసింది. 

టెస్టుల్లో చోటు ఖాయమే!
జనవరి 3 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌.. భారత జట్టుతో కలవనున్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన ఈ మిస్టర్‌ 360.. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు రంజీలోనూ తానేంటో మరోసారి నిరూపించుకున్న సూర్య.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లోనూ ఈ ముంబై బ్యాటర్‌ త్వరలోనే అరంగేట్రం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సూర్యకు ఒక్క అవకాశమిస్తే కచ్చితంగా సత్తా చాటుతాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసు నేపథ్యంలో ఆసీస్‌తో సిరీస్‌ కీలకం కానున్న తరుణంలో జట్టు ఎలా ఉండబోతుందో ఇప్పుడే అంచనాకు రాలేం! ఇదిలా ఉంటే.. రంజీ ప్రస్తుత సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో మొత్తంగా 185 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. రెండు సందర్భాల్లోనూ శతకం చేజార్చుకోవడం గమనార్హం. 

చదవండి: Ind Vs SL 2023: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లు.. శ్రీలంక జట్టు ప్రకటన
IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top