గంగూలీ.. ఇది ఎక్కడైనా ఉందా?

Ramachandra Guha Criticises Ganguly For Sacking Manjrekar - Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ను కామెంట్రీ ప్యానల్‌ నుంచి తప్పించడంపై క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ సభ్యుడు రామచంద్ర గుహ మండిపడ్డారు. సంజయ్‌ మంజ్రేకర్‌ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు దారుణమన్నారు. గతేడాడి వరల్డ్‌కప్‌ సమయంలో రవీంద్ర జడేజాను బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్‌ అని వ్యాఖ్యానించడం మంజ్రేకర్‌కు ముప్పుతెచ్చింది. అతన్ని కామెంట్రీ ప్యానల్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌కు సైతం మంజ్రేకర్‌ కామెంట్రీ చెప్పలేకపోయాడు. తను కామెంట్రీ ప్యానల్‌లో చేర్చాలని మంజ్రేకర్‌ మొరపెట్టుకున్నా బోర్డు మాత్రం ముందు నిర్ణయానికే కట్టుబడింది. దాంతో మంజ్రేకర్‌కు ఐపీఎల్‌ కామెంట్రీ చెప్పే అవకాశం రాలేదు. అయితే  భారత క్రికెట్‌ జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంజ్రేకర్‌ కామెంట్రీ చెప్పనున్నాడు. అయితే ఇక్కడ బీసీసీఐ తరఫున కాకుండా, సోనీ అతన్ని కామెంట్రీ చెప్పడానికి కొనుగోలు చేసింది. తమ ఇంగ్లిష్‌ కామెంట్రీ ప్యానల్‌లో చేర్చింది. (‘ఆ క్లిప్స్‌ చూస్తూ కోహ్లి బిగ్గరగా నవ్వుతాడు’)

కాగా, మంజ్రేకర్‌పై ఇంతటి కక్ష సాధింపు ధోరణి సరికాదంటూ రామచంద్ర గుహ పేర్కొన్నారు. అసలు కామెంటేటర్‌లపై బీసీసీఐ తన అధికారాన్ని చూపించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలా ప్రపంచ క్రికెట్‌లో ఎక్కడైనా జరిగిందా అంటూ నిలదీశారు. ‘ ఈ తరహా విధానం బీసీసీఐకి మంచిది కాదు.  బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ కామెంటేటర్ల వ్యవహారంలో ప్రవర్తిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ తనను తిరిగి తీసుకోవాలని మంజ్రేకర్‌ బోర్డుకు విన్నవించడం చాలా దారుణం. కామెంటేటర్లపై పెత్తనం చెలాయించాలనుకోవడం అర్థం లేనిది. ఈ విషయంలో బోర్డు అజమాయిషీ ఏమిటి. ప్రపంచ క్రికెట్‌లో ఎక్కడైనా ఇలా జరిగిందా?, ఒక్కసారి ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌లో జరుగుతున్న దానిని ఒక్కసారి ఊహించుకోండి’ అని గుహా విమర్శించారు.(‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top