పీవీ సింధుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

President And Prime Minister Praises Pv Sindhu For Win Bronze Medal - Sakshi

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సింధు విజయం ద్వారా భారత్‌కు మరింత గౌరవం దక్కిందని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కొనియాడారు. ఈ విజయం స్ఫూర్తిగా భారత యువత క్రీడల్లో రాణించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పీవీ సింధుని ప్రశంసించారు. కాగా  టోక్యో ఒలింపిక్స్‌కు భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది. పీవీ సింధు 21-13, 21-15 తేడాతో  బింగ్‌ జియావోపై గెలిచింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top