PKL 2022: పరాజయంతో మొదలు | PKL 2022: Bengaluru Bulls begin vivo Pro Kabaddi Season 9 with win over Telugu Titans | Sakshi
Sakshi News home page

PKL 2022: పరాజయంతో మొదలు

Oct 8 2022 5:21 AM | Updated on Oct 8 2022 5:21 AM

PKL 2022: Bengaluru Bulls begin vivo Pro Kabaddi Season 9 with win over Telugu Titans - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్‌ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్‌ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్‌ దేశాయ్‌ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు.

బెంగళూరు బుల్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్‌ నర్వాల్‌ (7 పాయింట్లు), భరత్‌ (5), వికాశ్‌ కండోలా (5), మహేందర్‌ సింగ్‌ (4), సౌరభ్‌ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్‌ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టుపై గెలుపొందింది.

Advertisement
 
Advertisement
Advertisement