విన్యాసాల వీరుడు.. ఫిల్‌ సాల్ట్‌ | Phil Salt Becomes Hero Three Stunning Catches Vs SRH IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: విన్యాసాల వీరుడు.. ఫిల్‌ సాల్ట్‌

Mar 29 2026 9:09 AM | Updated on Mar 29 2026 9:17 AM

Phil Salt Becomes Hero Three Stunning Catches Vs SRH IPL 2026

‘క్యాచ్‌స్ విన్ మ్యాచెస్’ అని ఊరికే అనలేదు.  ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అది మరోసారి నిరూపితమయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా  నిలిచాడు. ఫిల్‌ సాల్ట్‌ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సాల్ట్‌ అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి. 

14వ ఓవర్‌లో హెడ్‌ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలోక్లాసెన్ క్యాచ్ వివాదాస్పదమైనప్పటికీ ఎస్‌ఆర్‌హెచ్‌తో అతడు అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి అని చెప్పొచ్చు.  ఫిల్ సాల్ట్ చేతికి చిక్కిన ముగ్గురు (ఇషాన్ కిషన్‌, ట్రావిస్ హెడ్‌, హెన్రిచ్ క్లాసెన్‌) డేంజర్ బ్యాటర్లే.  ఈ ముగ్గురు సూపర్ బ్యాటింగ్‌తో అలరిస్తున్న సమయంలో సాల్ట్ అడ్డుగోడలా నిలిచాడు. 

ఇన్నింగ్స్‌ 2.4 ఓవర్‌లో జాకబ్ డఫీ వేసిన బంతిని హెడ్ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ దిశగా ఆడాడు. అయితే అక్కడే కాచుకు కూర్చున్న సాల్ట్ వెనక్కి పరిగెత్తి అద్భుతమైన రివర్స్ క్యాచ్ తీసుకున్నాడు. షెఫర్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతికి క్లాసెన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా... అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న సాల్ట్‌ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్‌ మీద పడ్డట్లు కనిపించింది. 

పలుమార్లు పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్‌ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఏదీ ఏమైనా సాల్ట్ అందుకున్న ఈ క్యాచ్ కూడా కాస్త క్లిష్టతరమైనదే. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన ఇషాన్ కిషన్ ‍ఇచ్చిన క్యాచ్‌ను సాల్ట్ అందుకున్న తీరు నభూతో నభవిష్యత్తు అని చెప్పొచ్చు. 

అభినందన్ వేసిన ఇన్నింగ్స్ 15.6 ఓవర్లో ఇషాన్ భారీ షాట్‌కు యత్నించాడు. పాయింట్ దిశగా ఇషాన్‌ కొట్టిన బంతిని సాల్ట్‌ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

గతేడాది ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లోనూ ఫీల్డింగ్‌లో  ఇదే తరహా విన్యాసాలతో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న సాల్ట్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను ఒడిసిపట్టడం అప్పట్లో ట్రేడ్‌మార్క్ క్యాచ్‌గా నిలిచిపోయింది. మొత్తంగా సాల్ట్ బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించి విన్యాసాల వీరుడిగా ముద్ర వేసుకున్నాడు.

చదవండి: అందుకే చేజింగ్ మాస్ట‌ర్ అనేది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement