PKL 2022: ఫైనల్లో పట్నా, ఢిల్లీ  | Patna Pirate-Delhi Dabang Enters Final Pro Kabaddi League 2022 | Sakshi
Sakshi News home page

PKL 2022: ఫైనల్లో పట్నా, ఢిల్లీ 

Feb 24 2022 7:46 AM | Updated on Feb 24 2022 10:30 AM

Patna Pirate-Delhi Dabang Enters Final Pro Kabaddi League 2022 - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్, దబంగ్‌ ఢిల్లీ టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో  మాజీ విజేత పట్నా 38–27 పాయింట్లతో యూపీ యోధపై, ఢిల్లీ 40–35తో బెంగళూరు బుల్స్‌పై గెలిచాయి. పట్నాతో జరిగిన పోరులో యూపీ స్టార్‌ రెయిడర్‌ పర్దీప్‌ నర్వాల్‌ తేలిపోయాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పర్దీప్‌ కేవలం 4 పాయింట్లే చేశాడు. పట్నా జట్టులో గుమన్‌ సింగ్‌ (8), సచిన్‌ (7), రెజా (6), సునీల్‌ (5) సమష్టిగా రాణించారు. పట్నా, ఢిల్లీ జట్ల మధ్య రేపు ఫైనల్‌ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement