World cup 2023: గెలుపు జోష్‌లో ఉన్న పాకిస్తాన్‌కు బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ

Pakistan fined for slow over-rate against New Zealand in Bengaluru - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్తాన్‌కు ఐసీసీ బిగ్‌ షాకిచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆ జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో 10 శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి పాకిస్తాన్‌ తమ కోటా ఓవర్ల కంటే రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్‌ విధించింది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కూడా నేరాన్ని అంగీకరించడంతో మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ కోత విధుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై  డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌ఎస్‌) పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో పాక్‌ విజయం సాధించింది. ఈ విజయంతో పాక్‌ తమ సెమీస్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. మొదట కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది.

రచిన్‌ రవీంద్ర (108; 15 ఫోర్లు, 1 సిక్స్‌) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్‌ విలియమ్సన్‌ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్‌ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్‌ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 200 పరుగులు చేసింది.

అప్పటి డక్‌వర్త్‌ లూయిస్‌ లెక్కల ప్రకారం మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి పాక్‌ 21 పరుగులు ముందంజలో ఉంది.  దీంతో పాక్‌ను విజేతగా నిర్ణయించారు. పాక్‌ బ్యాటర్లలో ఫఖర్‌ జమాన్‌ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (63 బంతుల్లో 66 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-11-2023
Nov 12, 2023, 22:00 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం సాధించాడు. ఈ...
12-11-2023
Nov 12, 2023, 21:44 IST
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్‌.. వరుసగా తొమ్మిదో విజయం  వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో రోహిత్‌...
12-11-2023
Nov 12, 2023, 21:09 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌  చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కేఎల్‌...
12-11-2023
Nov 12, 2023, 20:32 IST
వన్డేల్లో విరాట్‌ కోహ్లి తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ తీశాడు. వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌...
12-11-2023
Nov 12, 2023, 20:03 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్ జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు...
12-11-2023
Nov 12, 2023, 19:44 IST
దీపావళి పర్వదినాన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు టాపాసుల్లా పేలారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు మెరుపు...
12-11-2023
Nov 12, 2023, 19:07 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 48 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలో...
12-11-2023
Nov 12, 2023, 18:26 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో (8) దూసుకుపోతున్న టీమిండియా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు దీపావళి సంబురాల్లో పాల్గొంది. బెంగళూరులోని విలాసవంతమైన...
12-11-2023
Nov 12, 2023, 16:45 IST
టీమిండియా యంగ్‌ గన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అరాచకమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో అయితే అతను ఆకాశమే...
12-11-2023
Nov 12, 2023, 15:57 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (నవంబర్‌ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...
12-11-2023
Nov 12, 2023, 13:36 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో చివరి లీగ్‌ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు...
12-11-2023
Nov 12, 2023, 13:25 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా గాయం కారణంగా...
12-11-2023
Nov 12, 2023, 12:32 IST
అఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్‌.. ఆఫ్‌ది...
12-11-2023
Nov 12, 2023, 12:05 IST
పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్‌.. వన్డే ప్రపంచకప్‌-2023 టైటిల్‌ ఫేవరేట్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన జట్లలో ఒకటి. కానీ అందరి అంచనాలను...
12-11-2023
Nov 12, 2023, 09:18 IST
వన్డే ప్రపంచకప్‌-2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న భారత్‌-నెదర్లాండ్‌ మ్యాచ్‌తో ఈ ​మెగా టోర్నీ లీగ్‌ స్టేజి ముగియనుంది....
12-11-2023
Nov 12, 2023, 08:53 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023ను పాకిస్తాన్‌ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 93...
12-11-2023
Nov 12, 2023, 07:44 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా తమ అఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో...
11-11-2023
Nov 11, 2023, 21:37 IST
వన్డే ప్రపంచకప్‌-2023ను ఇంగ్లండ్‌ విజయంతో ముగించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల...
11-11-2023
Nov 11, 2023, 21:09 IST
ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి...
11-11-2023
Nov 11, 2023, 20:13 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు అర్హత...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top