
Usman Shinwari Announces Retirement From Test Cricket.. పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ షిన్వరీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని షిన్వరీ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. '' ఇటీవలే వెన్నునొప్పి నుంచి కోలుకున్నా. వేగంగా కోలుకోవడంలో సహాయపడిన స్పోర్ట్స్ ఫిజియో అహ్మదుల్లాకు కృతజ‍్క్షతలు. ఫిజియో, డాక్టర్లు సూచన మేరకు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. సుధీర్ఘంగా బౌలింగ్ చేస్తే గాయాలు మళ్లీ తిరగబెట్టే అవకాశాలున్యాయని వైద్యులు హెచ్చరించారు. అందుకే టెస్టులకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇక వన్డేలు, టి20లపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతానంటూ'' చెప్పుకొచ్చాడు
27 ఏళ్ల షిన్వరీ పాకిస్తాన్ జట్టు తరపున 17 వన్డేల్లో 34 వికెట్లు, 16 టి20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక తన కెరీర్‌లో ఒకే ఒక టెస్టు ఆడిన షిన్వరీ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీసిన షిన్వరీ రెండుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2019 డిసెంబర్‌లో ఆఖరిసారిగా పాక్ జట్టు తరపున ఆడాడు.