PAK vs ENG: పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్‌..

PAK vs ENG: Liam Livingstone ruled out for the remainder of the tour - Sakshi

పాకిస్తాన్‌ పర్యటలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ లియామ్ లివింగ్‌స్టోన్ టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌తో తొలి టెస్టులో లివింగ్‌స్టోన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా లివింగ్‌స్టోన్ మోకాలికి గాయమైంది.

ఈ క్రమంలోనే లివింగ్‌స్టోన్‌ దూరం కానున్నాడు. ఇక ఇదే విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ కూడా దృవీకరించింది. "లివింగ్‌ స్టోన్‌ మోకాలి గాయం కారణంగా మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము" అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ ట్విటర్‌లో పేర్కొంది. కాగా అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఇక పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ తొలి టెస్టు రసవత్తరంగా జరుగుతోంది.  ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ అఖరి రోజు ఆటకు చేరుకుంది. ఇంగ్లండ్‌ విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. పాకిస్తాన్‌ గెలుపొందాలంటే మరో 174 పరుగులు సాధించాలి. ఐదో రోజు లంచ్‌ విరామం సమయానికి పాకిస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

చదవండిKL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్‌ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top