Babar Azam: ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమి.. బాబర్‌ ఆజం చెత్త రికార్డు! మొదటి పాక్‌ కెప్టెన్‌గా..

Pak Vs Eng 3rd Test: Babar Azam Unwanted Record Becomes 1st Pakistan Captain - Sakshi

Pakistan vs England, 3rd Test- Babar Azam: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది పాకిస్తాన్‌. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించిన బాబర్‌ ఆజం బృందం.. ఇలా మరో పరభవాన్ని మూటగట్టుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా తొలి టెస్టులో 74 పరుగులు, రెండో టెస్టులో 26 పరుగులు, మూడో టెస్టులో 8 వికెట్లతో పరాజయం పాలైంది.

ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడి ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్‌ చేసి బెన్‌ స్టోక్స్‌ బృందం చరిత్ర సృష్టించింది. మరోవైపు.. పాక్‌ స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టులు ఓడటంతో కెప్టెన్‌ బాబర్‌ ఆజం పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో పర్యాటక జట్ల చేతిలో పాకిస్తాన్‌ వరుస మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే తొలిసారి.

బాబర్‌ ఆజం చెత్త రికార్డు
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో 1-0తో పాక్‌ టెస్టు సిరీస్‌ కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు డ్రాగా ముగియగా.. ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో పాక్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఏకంగా 3-0తో వైట్‌వాష్‌ చేసి సిరీస్‌ కైవసం చేసుకుంది.

కాగా ఈ రెండు సిరీస్‌లలో పాక్‌కు సారథ్యం వహించిన బాబర్‌ ఆజం.. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఇలా వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన మొదటి పాకిస్తాన్‌ కెప్టెన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. చెత్త కెప్టెన్సీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో బాబర్‌ ఆజం వరుసగా 78, 54 పరుగులు సాధించాడు.

పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ మూడో టెస్టు స్కోర్లు:
పాకిస్తాన్‌: 304 & 216
ఇంగ్లండ్‌: 354 & 170/2
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హ్యారీ బ్రూక్‌ (111 పరుగులు)

చదవండి: Harry Brook: ఇంగ్లండ్‌కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు
FIFA WC 2022: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top