ENG Vs PAK: ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం

పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు సొంత గడ్డపైనే ఘరో పరాభవం ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 50 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు తడబడడంతో 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ముందు 167 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. జాక్ క్రాలీ 41 పరుగులు, రెహాన్ అహ్మద్ 10 పరుగులు చేసి ఔటవ్వగా.. బెన్ డకెట్, స్టోక్స్‌లు మరో వికెట పడకుండా ఇంగ్లండ్‌ను గెలిపించారు. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది.
పాకిస్తాన్: 304 ఆలౌట్ & 216 ఆలౌట్
ఇంగ్లండ్: 354 ఆలౌట్& 170/2
🏴 3-0 🇵🇰
Whitewash at home 🫣🥱#ENGvPAK || #PAKvENG #TestCricket #WTC23 pic.twitter.com/XWXxGzpwbc
— Diptiman Yadav (@Diptiman_yadav9) December 20, 2022
మరిన్ని వార్తలు :