సెలక్టర్లు వింటారు: నితీశ్‌ రెడ్డికి ఇషాన్‌ కిషన్‌ వార్నింగ్‌! | Nitish Reddy Picks T20s, ODIs Over Tests ; Ishan Issues Selectors Warning | Sakshi
Sakshi News home page

సెలక్టర్లు వింటారు: నితీశ్‌ రెడ్డికి ఇషాన్‌ కిషన్‌ వార్నింగ్‌!

Mar 23 2026 12:50 PM | Updated on Mar 23 2026 1:02 PM

Nitish Reddy Picks T20s, ODIs Over Tests ; Ishan Issues Selectors Warning

PC: SRH

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌తో మార్చి 28న ఐపీఎల్‌-2026 టోర్నీకి తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.

కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌
ఇక ఆరంభ మ్యాచ్‌లకు ప్యాట్‌ కమిన్స్‌ దూరం కాగా.. అతడి గైర్హాజరీలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సన్‌రైజర్స్‌ నెట్‌ ప్రాక్టీస్‌, ఇంట్రాస్వ్కాడ్‌ మ్యాచ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది.

ఈ క్రమంలో ఆటవిడుపుగా సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు అభిమానులతో మమేకం అయ్యారు. ఫ్యాన్‌ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలతో అలరించారు. ఇందులో భాగంగా ఆంధ్ర కుర్రాడు, టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన కామెంట్లు.. అందుకు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ ఇచ్చిన కౌంటర్లు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సెలక్టర్లు వింటారు!
టెస్టు లేదంటే టీ20 ఫార్మాట్‌.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారని హోస్ట్‌ అడుగగా నితీశ్‌ రెడ్డి.. టీ20 అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత టెస్టు లేదంటే వన్డేలలో ఒకటి ఎంచుకోమనగా.. అతడు వన్డే అని బదులిచ్చాడు. 

ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘నువ్వు టెస్టు జట్టులో కీలక సభ్యుడివి బ్రో. సెలక్టర్లు ఈ మాటలు వింటారు జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. దీంతో నితీశ్‌తో పాటు ఆక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు.

కాగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన నితీశ్‌ రెడ్డిని.. హార్దిక్‌ పాండ్యాకు సరైన వారసుడిగా సెలక్టర్లు భావిస్తున్నారు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో హార్దిక్‌ గైర్హాజరీలో అడపాదడపా అవకాశాలు అందుకున్న నితీశ్‌.. గత రెండేళ్లుగా టెస్టుల్లో మాత్రం ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

అది సాధ్యం కాదు!
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇషాన్‌ కిషన్‌ నితీశ్‌ రెడ్డికి కౌంటర్‌ ఇవ్వడం గమనార్హం. ఇక ఐపీఎల్‌లో పవర్‌ ప్లేలో బ్యాటింగ్‌ చేయడం ఇష్టమా? లేదంటే డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌ ఇష్టమా? అని హోస్ట్‌ అడుగగా.. నితీశ్‌ రెడ్డి పవర్‌ ప్లే అని సమాధానం ఇచ్చాడు.

దీంతో మరోసారి ఇషాన్‌ కిషన్‌ కౌంటర్‌తో ముందుకు వచ్చాడు. నితీశ్‌ రెడ్డి రెగ్యులర్‌గా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు కాబట్టి.. అతడికి ఎంత ఇష్టం ఉన్నా పవర్‌ ప్లేలో బ్యాటింగ్‌ చేయలేడంటూ నవ్వులు పూయించాడు. 

టెస్టు జట్టులో స్థానం సుస్థిరం
కాగా సన్‌రైజర్స్‌ తరఫున 2024లో సత్తా చాటి భారత టీ20 జట్టులో అడుగుపెట్టిన నితీశ్‌ రెడ్డి.. అదే ఏడాది ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 టెస్టులు, 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

మరోవైపు ఇషాన్‌ కిషన్‌ దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవలే టీమిండియాలో పునరాగమనం చేశాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి సెలక్టర్లకు సవాల్‌ విసిరాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడిని టీ20 ప్రపంచకప్‌-2026 జట్టుకు ఎంపిక చేయగా.. భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement