BAN Vs NZ: చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌.. పదేళ్లలో కివీస్‌కు రెండో విజయం

New Zeland Super Victory 3rd T20 Only 2nd Win Bangladesh Last Decade - Sakshi

ఢాకా: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చిత్తుగా ఓడింది. తొలి రెండు టీ20ల్లో విజయం సాధించి ఊపుమీద కనిపించిన బంగ్లాదేశ్‌ అదే జోరును మూడో టీ20లో చూపించలేకపోయింది. మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 52 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఈ  విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. కాగా మ్యాచ్‌ మొత్తంలో  ఇరు జట్ల నుంచి ఒక్క సిక్సర్‌ లేకపోవడం విశేషం. అంతేగాక బంగ్లాదేశ్‌ గడ్డపై న్యూజిలాండ్‌కు గత పదేళ్లలో ఇది రెండో విజయం మాత్రమే. 

చదవండి: BAN Vs NZ: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ విక్టరీ.. 


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.  టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన వేళ లోయర్‌ ఆర్డర్‌లో హెన్రీ నికోల్స్‌ 36 నాఔట్‌, టామ్‌ బ్లండెల్‌ 30 పరుగులు చేశారు.  బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్‌ 2, ముస్తాఫిజుర్‌, మహ్మదుల్లా, మెహదీ హసన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ కివీస్‌ బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో 76  పరుగులకే ఆలౌట్‌ అయింది. ముష్ఫికర్‌ రహీమ్‌ 20 పరుగులు నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. కివీస్‌ బౌలర్ల దాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు డకౌట్‌ కాగా.. మరో ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో ఆదిక్యంలో ఉండగా.. నాలుగో టీ 20 బుధవారం(సెప్టెంబర్‌ 8న) జరగనుంది. 

చదవండి: Kohli Frustration: ఔటయ్యానన్న కోపంలో గోడను కొట్టిన కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top