BAN Vs NZ: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ విక్టరీ..  | Bangladesh Clinch 2nd Consecutive Victory Against New Zeland T20 Series | Sakshi
Sakshi News home page

BAN Vs NZ: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ విక్టరీ.. 

Sep 3 2021 8:15 PM | Updated on Sep 3 2021 9:39 PM

Bangladesh Clinch 2nd Consecutive Victory Against New Zeland T20 Series - Sakshi

ఢాకా: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ విజయంతో బంగ్లాదేశ్‌ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్లు నయీమ్‌ 39, లిట్టన్‌దాస్‌ 33 పరుగులు చేశారు. చివర్లో కెప్టెన్‌ మహ్మదుల్లా 37 పరుగులు నాటౌట్ రాణించాడు. కివీస్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర 3 వికెట్లు తీశాడు.

అనంతరం 142 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137  పరుగులు మాత్రమే చేసింది. కివీస్‌ బ్యాటింగ్‌లో టామ్‌ లాథమ్‌ 65 పరుగులు నాటౌట్‌గా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. బం‍గ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ ఒత్తిడికి లోనైంది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా కివీస్‌ 16 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్‌ ఆదివారం జరగనుంది.ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌ తాజాగా కివీస్‌ను మట్టికరిపించే ప్రయత్నంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement