
ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శాంట్నర్ ఉదర శస్త్రచికిత్స కారణంగా ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు.
అదేవిధంగా ముఖ గాయం కారణంగా ఆసీస్ సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర కూడా కోలుకున్నాడు. దీంతో అతడికి ఈ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ సిరీస్‌కు యువ పేసర్ బెన్ సీర్స్‌ను గాయం కారణంగా సెలక్టర్లు పక్కన పెట్టారు. మరోవైపు వెటరన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ జట్టులో లేడు.
అతడు టీ20ల తర్వాత జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. కివీస్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న విలియమ్సన్.. ప్రస్తుతం కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. విలియమ్సన్ చివరగా న్యూజిలాండ్ తరపున ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. కాగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ ఆక్టోబర్ 19 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా ప్రారంభం కానుంది.
సిరీస్ వివరాలు:
మొదటి టీ20 – అక్టోబర్ 18, క్రైస్ట్‌చర్చ్
రెండో టీ20 – అక్టోబర్ 20, వెల్లింగ్టన్
మూడో టీ20 – అక్టోబర్ 22, ఆక్లాండ్
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్)
చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా?