Ind Vs Sa Test Series: "ఫామ్‌లో లేడని కోహ్లిని తప్పిస్తారా.. రహానే విషయంలో మాత్రం ఎందుకు అలా"

Nehra addresses senior batters Test struggles, names player who is at most risk - Sakshi

టీమిండియా క్రికెటర్‌ అజింక్య రహానే గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో 19.57 సగటుతో 411 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే అతడికి  విదేశీ పిచ్‌లపై ఉన్న రికార్డల దృష్ట్యా దక్షిణాఫ్రికా పర్యటనకు  అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన శ్రేయాస్‌ అయ్యర్‌ రూపంలో రహానే స్ధానానికి గట్టి పోటీ నెలకొంది. అంతే కాకుండా హనుమ విహారి రూపంలో ఐదోస్ధానానికి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్‌ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంచూరియాన్‌ వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో రహానేకి చోటు దక్కడం కష్టమని అతడు అభిప్రాయపడ్డాడు.

"జట్టులో ఐదో స్ధానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ స్ధానంలో ఎవరని ఎంపిక చేయాలో అన్నది కష్టంగా మారింది. కేవలం గణంకాల ఆధారంగా మాత్రమే జట్టును ఎంపిక చేస్తే, కోహ్లి కూడా గత ఏడాదిగా ఫామ్‌లో లేడు. అయితే ఇప్పుడు కోహ్లి ఫామ్‌లో లేడని జట్టు నుంచి తప్పిస్తారా? పూజారా కూడా గత కొంత కాలంగా ఫామ్‌లో లేడు. అతడి గురించి ఎవరూ మాట్లాడరు. పూజారాకి జట్టులో కచ్చితంగా చోటు దక్కుతుంది. కానీ చివరకు  మిగిలినది రహానే మాత్రమే. అతడు రానున్న రోజుల్లో జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌కు రహానే సారథ్యం వహించాడు. ఇక రెండో టెస్ట్‌కు విరాట్‌ కోహ్లి జట్టులోకి రావడంతో రహానే ఏకంగా జట్టులో స్ధానాన్నే కోల్పోయాడు.

దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు టీమిండియా 5లేదా 6గురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని భావిస్తే రహానేకి చోటు దక్కడం కష్టం. కోహ్లికి లేదా పుజారాకు ఇదేమి కొత్త కాదు. కోహ్లి సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటాడు. 2018 పర్యటనలో జోహన్స్‌బర్గ్‌, కేప్‌టౌన్‌ పిచ్‌లపై భారత ఆటగాళ్లు ఆడటానికి ఇబ్బంది పడ్డారు. అయితే కోహ్లి మాత్రం 150 పరుగులు సాధించి అధ్బుతంగాగ రాణించాడు. ఈసారి కూడా కోహ్లి రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇక రహానే స్ధానంలో శ్రేయాస్‌ అయ్యర్‌ లేదా హనుమా విహారికు చోటు దక్క వచ్చు" అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.

చదవండి: దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలవడం చాలా కష్టం.. సిరీస్‌ వాళ్లదే: టీమిండియా మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top