Diamond League 2022: డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం

Murali Sreeshankar ends up in 6th position in Diamond League - Sakshi

మొనాకో: భారత లాంగ్‌జంపర్, కామన్వెల్త్‌ గేమ్స్‌ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్‌కు ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ కలిసి రాలేదు. బర్మింగ్‌హామ్‌ మెగా ఈవెంట్‌ ముగియగానే తన తొలి డైమండ్‌ లీగ్‌లో పోటీ పడేందుకు మొనాకో వెళ్లిన అతనికి నిరాశే ఎదురైంది. అక్కడి వాతావరణం, గాలి వేగం అతని ప్రదర్శనకు ప్రతికూలంగా మారింది. 23 ఏళ్ల మురళీ తన ఐదు ప్రయత్నాల్లో మెరుగైన ప్రదర్శనగా 7.94 మీటర్ల దూరం దూకాడు.

ఈ సీజన్‌లో 8.36 మీ. ప్రదర్శనతో పోలిస్తే ఇది పేలవమైన జంప్‌. కామన్వెల్త్‌ గేమ్స్‌లో అతను 8.08 మీ. జంప్‌ చేసి రజతం నెగ్గాడు. కానీ డైమండ్‌ లీగ్‌లో మాత్రం 8 మీటర్ల దూరమైన దూకలేకపోవడంతో ఆరో స్థానంలో నిలిచాడు. డైమండ్‌ లీగ్‌ నిబంధనల ప్రకారం ఇక్కడ పోటీలో ఉన్నవారందరికీ ఆరు ప్రయత్నాలు ఉండవు.

కేవలం టాప్‌–3 అథ్లెట్లకు మాత్రమే ఆరో జంప్‌కు అవకాశమిస్తారు. మిగతావారంతా ఐదు జంప్‌లకే పరిమితం అవుతారు. 23 ఏళ్ల శ్రీశంకర్‌ ఇప్పుడు రాబోయే మరో ఈవెంట్‌పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ నెల 30 నుంచి స్విట్జర్లాండ్‌లోని లూసానేలో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ టూర్‌ పోటీల్లో అతను పోటీ పడతాడు.
చదవండిCanadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top