
లాంగ్‌జంపర్ శ్రీశంకర్ అవుట్
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు కూడా భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్‌లో శ్రీశంకర్ మురళీ క్వాలిఫయింగ్‌లోనే ని్రష్కమించాడు. 19మంది అథ్లెట్లు పోటీపడ్డ గ్రూప్ ‘ఎ’లో శ్రీశంకర్ 14వ స్థానంలో నిలిచాడు. మూడు ప్రయత్నాల్లో శ్రీశంకర్ వరుసగా 7.78 మీటర్లు, 7.59 మీటర్లు, 7,70 మీటర్ల దూరం దూకాడు.
కనీసం 8.15 మీటర్ల దూరం దూకిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. ఓవరాల్‌గా 36 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ 25వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో భారత క్రీడాకారిణులు పారుల్, అంకిత హీట్స్‌లోనే వెనుదిరిగారు. ఓవరాల్‌గా పారుల్ (9ని:22.24 సెకన్లు) 20వ స్థానంలో, అంకిత (10ని:03.22 సెకన్లు) 35వ స్థానంలో నిలిచారు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ షిర్సే (13.57 సెకన్లు) 29వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.