ఐపీఎల్‌లో ధోనినే నా అత్యంత విలువైన ఆటగాడు...

MS Dhoni is Still My Most Valuable Player Of IPL 2021 - Sakshi

Matthew Hayden Comments on Ms Dhoni Captaincy: ఐపీఎల్‌2021 సెకెండ్‌ ఫేజ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే ప్లేఆప్‌ బెర్త్‌ను కన్‌ఫర్మ్  చేసుకుంది.  ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పై ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌2021లో  ఎంఎస్ ధోనీ తన అత్యంత విలువైన ఆటగాడని అతడు తెలిపాడు. ఐపీఎల్‌ రెండోదశలో ధోని కెప్టెన్సీ వ్యూహాల కారణంగా చెన్నై వరుస విజయాలు సాదిస్తుందని.. ఈ ఘనత పూర్తిగా అతడికే చెందుతుందని హేడెన్  ఆభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్‌లో ధోని రాణించక పోయినప్పటి తన చాణుక్య బుర్రతో ఆ జట్టును నడిపిస్తున్నాడని అతడు వెల్లడించాడు. ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ తన భుజాన వేసుకున్నాడు అని ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ వివరించాడు. అంతేగాక కెప్టెన్‌గా జట్టు ఎంపిక లో ధోని మార్క్‌ సృఫ్టంగా కనిపిస్తుందని  హేడెన్ తెలిపాడు. కాగా చెన్నై దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో నేడు తలపడనుంది.

చదవండి: పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top