
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే వరుస విజయాలకు బ్రేక్ పడింది. గురువారం సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగింది.
మ్యాచ్ ఓటమిపై ధోని స్పందించాడు. ''ఈ పిచ్‌పై ఇంత టార్గెట్ కొంచెం కష్టతరమే. అయితే తొలి ఆరు ఓవర్లలో మా బౌలర్లు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో బౌలర్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి కొన్ని మిస్‌ఫీల్డ్‌ల వల్ల పరుగులు వచ్చాయి. ఇక పతీరానా బౌలింగ్ బాగానే ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంతటి బౌలర్ అయినా ఏం చేయలేడు. ఇక రాజస్తాన్ బ్యాటింగ్ అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా యశస్వి జైశ్వాల్, ద్రువ్ జురేల్ లాంటి కుర్రాళ్లు అద్బుతంగా ఆడారు. కానీ గెలుపు ఒక్కరికే దక్కుతుంది.. ఈరోజు రాజస్తాన్‌దే.'' అని చెప్పుకొచ్చాడు.
జైపూర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ధోని.. '' జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం నాకు ప్రత్యేకం. నా కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ వైజాగ్‌లో వచ్చినప్పటికి.. ఈ స్టేడియంలో ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్ నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. అందుకే జైపూర్ స్టేడియానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మాకు మద్దతిచ్చిన అభిమానులందరికి కృతజ్థతలు'' అంటూ తెలిపాడు.
MS Dhoni said "fans will be chasing me this year (smiles), Jaipur has a special place in my heart for my 183*". pic.twitter.com/srXedpHFPA
— Johns. (@CricCrazyJohns) April 27, 2023
చదవండి: సీఎస్‌కేపై ఆధిపత్యం.. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో గుర్తుండిపోయే విజయం