IPL 2023 విజేత, కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?

IPL 2023 Winner CSK captain MS Dhoni networth lifestyle chek details - Sakshi

గ్రౌండ్‌లోనే కాదు...గ్రౌండ్‌ బయటకూడా  తగ్గేదేలే

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు

 లగ్జరీ కార్లు, బైక్స్‌  కలెక్షన్‌

క్రికెట్‌ దిగ్గజం ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్  ఐపీఎల్‌ 2023 టైటిల్‌ను చేజిక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచి అభిమానులను ఉర్రూత లూగించింది టీం.  దీంతో  ప్రశంసల వెల్లువ కురుస్తోంది.

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో, క్రికెట్‌ కరియర్‌లో అనేక రికార్డులను నమోదుచేసిన ధోని కేవలం గ్రౌండ్‌లోనే కాదు, వెలుపల కూడా తగ్గేదేలే అంటూ పెర్‌ఫెక్ట్‌ బిజినెస్‌మేన్‌లా సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతున్నాడు మాజీ కెప్టెన్ పలు పెట్టుబడులు  ప్రసిద్ధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో ఇండియాలో టాప్‌ రిచెస్ట్‌ ప్లేయర్‌గా ఉన్నాడు.

ఎంఎస్ ధోని నికర విలువ ఎంత?
అంచనాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువ దాదాపు రూ. 1040 కోట్లు. వార్షిక వేతనం, 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అనేక రకాలు పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు, ఐపీఎల్‌ రెమ్యునరేషన్‌తో కలిపి మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు.  

ఐపీఎల్‌ టీం సీఎస్‌కే ద్వారా రూ. 12 కోట్ల ఆదాయం వస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం గత పదహారు సీజన్‌లలో ఐపీఎల్‌ ద్వారా రూ. 178 కోట్లకు పైగా సంపాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని మొత్తం సంపాదనలో ఇది చిన్న మొత్తమే. ఖటాబుక్, కార్స్ 24, షాకా హ్యారీ, గరుడ ఏరోస్పేస్ వంటి అనేక వాటిలో ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ఇంకా  ఫిట్‌నెస్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్‌లో మెజారిటీ వాటాదారు.సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్‌లు, క్రీడా దుస్తులు, జిమ్‌ బిజినెస్‌.. ఇలా మొత్తం కలిపి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.

కోకా కోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ , రీబాక్ వంటి బ్రాండ్‌లు ఎంఎస్‌ ఖాతాలో ఉన్నాయి.  దీంతోపాటు ఫుట్‌బాల్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సి, హాకీ టీమ్ రాంచీ రేస్ , మహి రేసింగ్ టీమ్ ఇండియాలో వాటాలున్నాయి. (ఐపీఎల్‌ 2023: ముంబై ఇండియన్స్‌ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?)

ధోని సాక్షి ధోని లగ్జరీ లైఫ్ స్టైల్
ధోనీ, అతని భార్య సాక్షి ధోనీ ఇద్దరూ  లగ్జరీ వస్తువులు, ఇళ్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జార్ఖండ్‌లోని రాంచీలో వీరికి ఒక భారీ ఫామ్‌హౌస్‌ ఉంది. ఇక్కడే ధోనీ సాక్షి, వారి కుమార్తె జీవాతో నివసిస్తున్నారు, దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ. దీంతోపాటు జంటకు  డెహ్రాడూన్‌లో రూ. 17.8 కోట్ల ఇల్లు కూడా  ఉంది.

ఇక ధోనికి కార్లు, బైక్‌లపై  ఉండే పప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కళ్లు చెదిరే కలెక్షన్‌ అతని సొంతం.  హమ్మర్ హెచ్2, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మహీంద్రా స్కార్పియో, ఫెరారీ 599 జిటిఓ, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, నిస్సాన్ జోంగా, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఆమ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, హిందుస్తాన్ అంబాటోరోస్, రోల్స్ రాయ్‌టోర్ల లాంటి  ఉన్నాయి.  (ఐపీఎల్‌ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్‌ నెట్‌వర్త్‌ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు)

ఇది కాకుండా ధోని జీవితం ఆధారంగా తీసిన హిట్ మూవీ 'ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' ద్వారా దాదాపు రూ. 30 కోట్లు సంపాదించాడు. ఈ మూవీలో  రీల్‌ ధోని పాత్రను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించారు. కెప్టెన్ కూల్‌గా పాపులర్‌ అయిన  ధోని, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్‌ తీసుకున్న ధోనీ  ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top