‘ఆ ఫాస్ట్‌ బౌలర్‌పైనే ధోని ఆశలు’

MS Dhoni Depends A Lot On Deepak Chahar, Ajit Agarkar - Sakshi

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) బలహీనంగానే కనబడుతోంది. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌లు జట్టుకు దూరం కావడంతో సీఎస్‌కే అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో కూడా వీక్‌గానే కనబడుతోంది. బ్యాటింగ్‌లో రైనా స్థానాన్ని మురళీ విజయ్‌తో పూడ్చాలని చూస్తున్న సీఎస్‌కే.. బౌలింగ్‌లో పరుగులు నియంత్రణ చేసేది ఎవరూ అనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఇమ్రాన్‌ తాహీర్‌ వంటి స్పిన్నర్‌ సీఎస్‌కేకు అందుబాటులో ఉన్నా భజీ స్థానాన్ని ఏదో రకంగా భర్తీ చేయాలనే కసరత్తులు చేస్తోంది. ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత మొత్తం 13 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఇద్దరు క్రికెటర్లు దీపర్‌ చహర్‌, రుతురాజ్‌ గ్వైక్వాడ్‌లు కరోనా బారిన పడ్డారు. దీపక్‌ చహర్‌ కరోనా నుంచి కోలుకున్నా రుతురాజ్‌ గ్వైక్వాడ్‌ మాత్రం ఇంకా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు. బ్యాట్స్‌మన్‌, ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన గ్వైక్వాడ్‌పై కూడా సీఎస్‌కే ఆశలు పెట్టుకుంది.  గ్వైక్వాడ్‌ ఏమన్నా భజ్జీ ప్రత్యామ్నాయం అవుతాడా అనే విషయాన్ని  కూడా సీఎస్‌కే పరిశీలిస్తోంది.(చదవండి: ఆర్సీబీ.. ఈ జట్టుతో ఎలా నెట్టుకొస్తారు?)

కాగా,. సీఎస్‌కే బౌలింగ్‌లో ప్రధాన ఆయుధం పేసర్‌ దీపక్‌ చహర్‌ అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి సీఎస్‌కేకు చాహర్‌ కీలకం కానున్నాడన్నాడు. కాకపోతే కడవరకూ అతని ఫిట్‌నెస్‌ ఎంతవరకూ కాపాడుకుంటాడు అనేది ఇక్కడ పరిశీలించాన్నాడు. ‘ చాహర్‌పై ధోని భారీ ఆశలు పెట్టుకున్నాడు. చాహర్‌పై ధోని చాలా ఎక్కువగా ఆధారపడతాడనే విషయం నాకు తెలుసు. కొత్త బంతిని చహర్‌ పంచుకోవాల్సి ఉంది. చాలాకాలం నుంచి అందరు క్రికెటర్లు తరహాలనే చహర్‌ కూడా సరైన ప్రాక్టీస్‌ లేదు.  దానికి తోడు ఐపీఎల్‌ కోసం దుబాయ్‌కు వెళ్లిన తర్వాత కరోనా బారిన పడి హెమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. దాంతో ప్రాక్టీస్‌ కూడా తగ్గింది. 2018లో టైటిల్‌ గెలిచిన సీఎస్‌కే జట్టులో చహర్‌ సభ్యుడు. ప్రస్తుతం సీఎస్‌కేకు చహర్‌ చాలా ముఖ్యమైన ఆటగాడు.  ఇన్నింగ్స్‌ ఆరంభంలో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను దొరకబుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గతేడాది డిసెంబర్‌లో చహర్‌ వెన్నుగాయంతో బాధపడ్డాడు. ఏప్రిల్‌ వరకూ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు అతను ఫిట్‌నెస్‌ను కాపాడుకుని కడవరకూ నిలబడాలి. ధోని ఎక్కువ ఆశలు పెట్టుకున్న బౌలర్‌ చహర్‌ సీజన్‌ అయ్యేంతవరకూ జట్టుతో ఉంటేనే సీఎస్‌కే పోటీలో ఉంటుంది’ అని స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టడ్‌ షోలో అగార్కర్‌ తెలిపాడు.(చదవండి: ‘కోహ్లిని ఔట్‌ చేయడానికి ఒక్క బాల్‌ చాలు’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top