ఆర్సీబీ.. ఈ జట్టుతో ఎలా నెట్టుకొస్తారు?

Aakash Chopra Highlights Glaring Weaknesses In RCB Squad - Sakshi

ఇది టైటిల్‌ గెలిచే జట్టేనా?

వేలంలో సరైన ప్లానింగ్‌ లేదు

ఆకాశ్‌ చోప్రా విమర్శలు

న్యూఢిల్లీ:  ఎప్పటిలాగే ఈ సీజన్‌ ఐపీఎల్‌లో కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఫేవరెట్‌ కాదనే అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేశాడు టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా.  ఆర్సీబీ జట్టులో తగినంత బ్యాటింగ్‌ బలం లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చాడు. అసలు ఆర్సీబీలో సరైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉందా అని ప్రశ్నించాడు.  ఈ మేరకు తన యూట్యాబ్‌ చానల్‌లో ఆర్సీబీ ఫ్రాంచైజీపై స్వాట్‌( స్ట్రెంగ్త్‌, వీక్‌నెస్‌, ఆపర్చునిటీ, థ్రెట్స్‌) అనాలిసిస్‌ చేశాడు చోప్రా.‘ ఆర్సీబీ స్క్వాడ్‌లో బలహీనతలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఇది నిజం. మీరు వేలానికి సరిగా వెళ్లనప్పుడు ఆడటానికి వచ్చేసరికి వెనుకబడే ఉంటారు. సరైన ట్రేడింగ్‌ విండోస్‌ ప్రకారం ఆర్సీబీ ముందుకెళ్లలేదు. కనీసం వేలానికి ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా అవగాహన లేకుండా వెళ్లారు. మీరు పూర్తిస్థాయి జట్టుతో ఐపీఎల్‌కు సిద్ధం కాలేదు. (చదవండి: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌.. సక్సెస్‌ ఫియర్‌)

మీ జట్టులో చాలా లోపాలున్నాయి. ప్రధానంగా బ్యాటింగ్‌లో డెత్‌ ఓవర్ల వరకూ ఉండే లైనప్‌ ఉందా?, కోహ్లి, డివిలియర్స్‌ ఆడితే సరే.. ఒకవేళ వీరిద్దరూ ఆడని పక్షంలో ఆ తర్వాత పరిస్థితి ఏమిటి?, మీ ఇద్దరి తర్వాత బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం జట్టులో ఉందా?,లేదు కదా.. మొయిన్‌ అలీ, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో దూబే, సుందర్‌కు కొద్ది పాటి అనుభవం మాత్రమే ఉంది. దాంతో అలీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కిందకు దింపాల్సి ఉంటుంది. ఇక క్రిస్‌ మోరిస్‌ ఉన్నాడు. ఈ నలుగురు ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్‌లు కాదు. ఇది బ్యాటింగ్‌లో ఆర్సీబీ సమస్య. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే డెత్‌ ఓవర్ల బౌలింగ్‌లో మోరిస్‌ డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు కాదు. డేల్‌ స్టెయిన్‌ను ఆడించినా అతను కూడా డెత్‌ ఓవర్ల బౌలర్‌ కాదు. మరి అటువంటప్పుడు డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు ఎవరు?, నవదీప్‌ సైనీ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ నమ్మదగిన బౌలర్లు కూడా కాదు. ఇన్ని సమస్యలు ఆర్సీబీలో ఉన్నాయి. ఈ జట్టుతో ఆర్సీబీ ఎలా నెట్టుకొస్తుందో తెలియడం లేదు’ అని ఆకాశ్‌ చోప్రా ధ్వజమెత్తాడు.(చదవండి: ‘కోహ్లిని ఔట్‌ చేయడానికి ఒక్క బాల్‌ చాలు’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-10-2020
Oct 28, 2020, 16:52 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్‌తో పాటు...
28-10-2020
Oct 28, 2020, 14:03 IST
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్‌ జట్టు ఫుల్‌ జోష్‌లో ఉంది. ఐపీఎల్-2020‌ టోర్నీలో నిలవాలంటే తప్పనిసరిగా...
28-10-2020
Oct 28, 2020, 01:55 IST
వార్నర్‌కు అసలైన పుట్టిన రోజు బహుమతి. ఐపీఎల్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్‌తో...
27-10-2020
Oct 27, 2020, 23:02 IST
దుబాయ్‌:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విజయం సాధించింది. ఢిల్లీని 19 ఓవర్లలో131 పరుగులకే ఆలౌట్‌...
27-10-2020
Oct 27, 2020, 21:07 IST
దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెలరేగిపోయింది. బ్యాటింగ్‌కు దిగింది మొదలు చివరి వరకూ పరుగుల మోత...
27-10-2020
Oct 27, 2020, 20:16 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎట్టకేలకు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కచ్చితంగా గెలిస్తేనే...
27-10-2020
Oct 27, 2020, 19:08 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది....
27-10-2020
Oct 27, 2020, 17:42 IST
దుబాయ్‌: తమిళనాడులోని గోపి కృష్ణన్ అనే ఓ అభిమాని సీఎస్‌కే కెప్టెన్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ఉన్న...
27-10-2020
Oct 27, 2020, 17:01 IST
న్యూఢిల్లీ:  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్‌ సింగ్‌...
27-10-2020
Oct 27, 2020, 16:30 IST
అబుదాబి:  వచ్చే నెల చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టును ఆదివారం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయగా,  అందులో...
27-10-2020
Oct 27, 2020, 15:21 IST
దుబాయ్‌:  ఇంగ్లండ్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన బౌలింగ్‌తోనే కాదు.. తన ట్వీట్ల ద్వారాను ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు....
27-10-2020
Oct 27, 2020, 15:00 IST
తొలుత మ్యాచ్‌లన్నీ ఓడినా... ఆ తర్వాత గెలుపు బాటపట్టింది. ఇక సోమవారం నాటి మ్యాచ్‌తో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న...
27-10-2020
Oct 27, 2020, 12:53 IST
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అస్సలు కలిసిరాలేదు. టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన...
27-10-2020
Oct 27, 2020, 06:31 IST
దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా మూడుసార్లు మాజీ చాంపియన్‌...
27-10-2020
Oct 27, 2020, 04:27 IST
అబుదాబి: కీలక సమయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ (60 బంతుల్లో 107 నాటౌట్‌; 14 ఫోర్లు 3...
27-10-2020
Oct 27, 2020, 04:06 IST
పంజాబ్‌ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్‌ ఓవర్‌లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు....
26-10-2020
Oct 26, 2020, 22:56 IST
షార్జా:  వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని...
26-10-2020
Oct 26, 2020, 22:32 IST
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది....
26-10-2020
Oct 26, 2020, 21:16 IST
షార్జా: కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌...
26-10-2020
Oct 26, 2020, 20:31 IST
అబుదాబి: రాజస్తాన్‌ రాయల్స్‌- ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.  ముంబై నిర్దేశించిన...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top