Mohammed Siraj Main Reason For Kohli-Gambhir Fight LSG Vs RCB IPL 2023 - Sakshi
Sakshi News home page

#MohammedSiraj: చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్‌ గొడవకు మూల కారకుడు?

Published Tue, May 2 2023 6:59 PM

Mohammed Siraj Main Reason For Kohli-Gambhir Fight LSG Vs RCB IPL 2023 - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌ వార్తల్లో నిలిచింది. సోమవారం పోస్ట్‌ మ్యాచ్‌ అనంతరం అర్థరాత్రి నుంచి కోహ్లి, గంభీర్‌ల వాగ్వాదం క్రికెట్‌ను కుదిపేస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఈ అంశమే ప్రస్తావనకు వస్తోంది. నవీన్‌ ఉల్‌ హక్‌ కారణంగా కోహ్లి, గంభీర్‌లు గొడవపడ్డారన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే అసలు ఈ గొడవకు మూల కారణం వేరే ఉంది. అసలు గొడవ ఎక్కడ మొదలైంది.. దీనికి ఎవరు కారణం అని ఆరా తీస్తే మహ్మద్‌ సిరాజ్‌ పేరు బయటికి వచ్చింది. వాస్తవానికి మ్యాచ్‌లో గొడవ ప్రారంభంమైంది సిరాజ్‌తోనే. లక్నో బ్యాటింగ్‌ 17వ ఓవర్‌లో ఈ పోరు మొదలైంది.

ఈ సందర్భంగా క్రీజులో అమిత్ మిశ్రా, నవీల్ ఉల్ హక్ ఉన్నారు. లక్నో 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. 17వ ఓవర్ వేయడానికి మహ్మద్ సిరాజ్వచ్చాడు. ఈ ఓవర్ తొలి 5 బంతుల్లో సిరాజ్ 8 పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి ఫ్రీ హిట్‌ అయింది. అయితే ఫ్రీ హిట్‌ను ఎదుర్కోవడంలో నవీన్ విఫలమవడంతో అది డాట్ బాల్ అయింది. తర్వాత సిరాజ్ బంతిని అందుకుని నవీన్ వైపు చూశాడు. అంతే కాకుండా నవీన్ క్రీజులో ఉన్నా.. బంతిని వికెట్‌కి విసిరాడు.

ఈ సందర్భంగా సిరాజ్-నవీన్ మధ్య స్వల్ప స్థాయిలో మాటల వాగ్వాదం జరిగింది. ఇక్కడే అసలు గొడవకు బీజం పడింది. ఆ తర్వాత కోహ్లీ జోక్యం చేసుకోవడంతో గొడవ పెద్దదైంది. మధ్యలో అమిత్ మిశ్రా వచ్చి కోహ్లీని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ, కోహ్లి మిశ్రాపై విరుచుకుపడ్డాడు.

ఆ తర్వాత ఘటనను అంపైర్‌కు వివరిస్తుండగా కోహ్లీ సహనం కోల్పోయాడు. చివర్లో కోహ్లీ తన షూ డస్ట్‌ని నవీన్‌కి చూపించాడు. ఆ తర్వాత నుంచి జరిగిన కథంతా మీకు తెలిసిందే. ఇదంతా చూసిన అభిమానులు.. ''దీన్నిబట్టి అసలు గొడవకు సూత్రధారి సిరాజ్‌ అన్నమాట.. చేయాల్సిదంతా చేసి సిరాజ్‌ సైడ్‌ అవ్వగా.. గొడవ ద్వారా కోహ్లి అనవసరంగా హైలెట్‌ అయ్యాడంటూ'' అభిమానులు తెగ బాధపడ్డారు.

చదవండి: నవీన్‌ ఉల్‌ హాక్‌ మామూలోడు కాదు.. అఫ్రిది లాంటి ముదురును కూడా లెక్కచేయలేదు..!

Advertisement
Advertisement