కోహ్లితో గొడవ పడిన నవీన్‌ ఉల్‌ హాక్‌ మామూలోడు కాదు.. అతని ఘనకార్యాల గురించి తెలుసుకోవాల్సిందే..!

LSG Naveen Ul Haq Involved In Heated Argument All Over The World - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నిన్న (మే 1) జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-నవీన్‌ ఉల్‌ హాక్‌- గౌతమ్‌ గంభీర్‌ల మధ్య వివాదం క్రికెట్‌ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ నోట విన్నా, ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంపై చూసినా ఇదే టాపిక్‌పై డిస్కషన్‌ నడుస్తోంది. ఎవరికి తోచిన విధంగా వారు కోహ్లి-నవీన్‌-గంభీర్‌ల క్యారెక్టర్‌లను అనలైజ్‌ చేస్తున్నారు.

కోహ్లి-గంభీర్‌ల మధ్య పచ్చిగడ్డి వేయకుండానే భగ్గుమనేది..
కొందరు గొడవ స్టార్ట్‌ చేసింది కోహ్లి అంటే, మరికొందరు నవీన్‌ను తప్పుపడుతుంటే, మెజారిటీ శాతం గంభీర్‌ గొడవను పెద్దది చేసి ఓవరాక్షన్‌ చేశాడని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా నిజానిజాలు, పూర్వపరాలు తెలుసుకోకుండా కామెంట్లు చేయడం మాత్రం తప్పే. కోహ్లి-గంభీర్‌ల విషయానికొస్తే.. వీరి మధ్య వైరం​ ఈనాటిది కాదు. ఇద్దరు కలిసి టీమిండియాకు ఆడే రోజుల నుంచే వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.

ఐపీఎల్‌లో సైతం వీరు పలు సందర్భాల్లో కొట్టుకునే దాకా వెళ్లారు. ఆట వరకు వీరిద్దరు పర్ఫెక్షనిస్ట్‌లే అయినప్పటికీ.. వీరి ఆన్‌ ఫీల్డ్‌ బిహేవియర్‌ మాత్రం కెరీర్‌ ఆరంభం నుంచే బాగోలేదు. భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో వీరిద్దరూ ఫెల్యూర్సే అని చెప్పాలి. అయితే ఉద్దేశపూర్వకంగా గొడవ పడాలని వీరెప్పుడూ అనుకోరని వీరితో పరిచయమున్న ఎవరినడిగినా చెబుతారు. ఆటలో భాగంగా మొదలయ్యే కవ్వింపు కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసింది.

అదే నవీన్‌ ఉల్‌ హాక్‌ విషయానికొస్తే.. అమాయకంగా కనిపించే ఈ ఆఫ్ఘానీ పేసర్‌ చాలా మదురు అని జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అతని చిన్నపాటి కెరీర్‌ మొత్తం వివాదాల మయం. ప్రపంచం నలుమూలలా జరిగే లీగ్‌ల్లో పాల్గొన్న నవీన్‌.. దాదాపు ప్రతి చోట ఎవరితో ఒకరితో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓసారి అతని ఘనకార్యాల ట్రాక్‌ రికార్డుపై లుక్కేస్తే ఈ విషయం క్లియర్‌గా అర్ధమవుతుంది.

అమీర్‌, షాహిద్‌ అఫ్రిదిలతో గొడవ..
2020 లంక ప్రీమియర్‌ లీగ్‌లో నవీన్‌ తన కంటే మహామదుర్లైన పాకిస్తాన్‌ ఆటగాళ్లు షాహిద్‌ అఫ్రిది, మహ్మద్‌ అమీర్‌లతో గొడవపడ్డాడు. ఆతర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌-2022లో డి ఆర్కీ షార్ట్‌తో, 2023 లంక ప్రీమియర్‌ లీగ్‌లో తిసార పెరీరాతో, ఐపీఎల్‌ 2023లో విరాట్‌తో కయ్యానికి కాలు దువ్వాడు. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబుల్‌ ప్రాంతానికి చెందిన నవీన్‌.. దేశవిదేశాల్లో ఆడిన చాలా మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లతో గొడవలు పడ్డాడు.

సహచరుడు రషీద్‌ ఖాన్‌ను చూసి నేర్చుకోవాలి..
అడపాదడపా టాలెంట్‌తో నెట్టుకొస్తున్నాడని కొన్ని ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి, లేకపోతే ఇతన్ని దేకేవాడే లేడు. సహచరులు, గుజరాత్‌ ఆటగాళ్లు రషీద్‌ ఖాన్‌, యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ ఎంత హుందాగా వ్యవహరిస్తారో, అందుకు ఇతను పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించి తమ దేశ పరువును పోగొట్టుకున్నాడు. వయసులో పెద్దవాడు, క్రికెట్‌ దిగ్గజం​ అయిన విరాట్‌ కోహ్లి ఆవేశంలో ఓ మాట అన్నాడని సర్దుకుపోయి ఉంటే, ఈ వివాదం ఇంత పెద్దదయ్యే కాదు. మంచికో చెడుకో కోహ్లితో వివాదం కారణంగా చాలామంది​కి తెలియని నవీన్‌ పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top