
ఫైల్ ఫోటో: విరాట్ కోహ్లితో మహ్మద్ నబీ
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు నబీ వెల్లడించాడు.
ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీ కరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని నబీ తనకు తనకు తెలియజేసినట్లు నసీబ్ ఖాన్ వెల్లడించాడు. అతడిని నిర్ణయాన్ని బోర్డు కూడా గౌరవించినట్లు నసీబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
కాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నబీ టీ20ల్లో మాత్రం అఫ్గాన్‌కు తన సేవలను కొనసాగించనున్నాడు. కాగా ఈ అఫ్గాన్ మాజీ కెప్టెన్ ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు సైతం విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2026 వరకు నబీ పొట్టి ఫార్మాట్‌లో కొనసాగే అవకాశముంది.
ఒకే ఒక్కడు..
అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం సేవలందించిన క్రికెటర్లలో మహ్మద్ నబీ అగ్రస్ధానంలో ఉంటాడు. 2009లో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నబీ తన కెరీర్‌లో 165 వన్డేలు ఆడాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లపై అఫ్గాన్ చారిత్రత్మక విజయాలు సాధించడంలో నబీది కీలక పాత్ర.
ఇప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకాలని నబీ నిర్ణయించుకున్నాడు. 165 వన్డేల్లో 3,549 పరుగులతో పాటు 171 వికెట్లు నబీ సాధించాడు.
చదవండి: WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. జోషఫ్‌కు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్