Ind vs Aus: అజారుద్దీన్‌ రివర్స్‌ అటాక్‌.. మ్యాచ్‌ నిర్వహించడం అంత ఈజీ కాదు..

Mohammad Azharuddin Sensational Comments On gymkhana Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మ​​​కాల నేపథ్యంలో జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌.. హెచ్‌సీఏ, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. టికెట్ల గోల్‌మాల్‌ వ్యవహారాన్ని అజారుద్దీన్‌ లైట్‌ తీసుకున్నారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎదుటే అజారుద్దీన్‌ రివర్స్‌ అటాక్‌  ఇచ్చారు. అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించడం మీటింగ్‌లో కూర్చుని మాట్లాడినంత సులభం కాదని అజారుద్దీన్‌ అన్నారు. తనకు మ్యాచ్‌ నిర్వహణ పనులు చాలా ఉన్నాయని.. మీతో మాట్లాడే సమయం లేదంటూ మంత్రితో ఆయన చెప్పినట్లు సమాచారం.

ఇప్పటికే టిక్కెట్ల మొత్తం అమ్ముడుపోయయాని, ఆన్‌లైన్‌లో పెట్టడానికి కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ఇక టికెట్ల గోల్‌మాల్‌ అంశంపై ప్రశ్నించగా.. అజారుద్దీన్‌ సమాధానం చెప్పకుండా దాటేసినట్లు తెలిసింది. కాగా తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయంటూ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే టికెట్ల అమ్మకాలకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రికి అందజేస్తామని అజారుద్దీన్‌ పేర్కొన్నారు.

చదవండిInd A vs NZ A 1st ODI: ఆల్‌రౌండ్‌ ప్రతిభ.. న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top