Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు..

Mitali Raj Retiremetn: Controversy-Other Intresting Facts Career-Personal - Sakshi

మిథాలీరాజ్‌.. టీమిండియా మహిళా క్రికెట్‌లో ఆమె స్థానం సుస్థిరం. మెన్స్‌ క్రికెట్‌లో సచిన్‌ ఎంత పాపులర్‌ అయ్యాడో.. టీమిండియా మహిళా క్రికెట్‌లో మిథాలీరాజ్‌ అంతే స్థానం సంపాదించింది. మహిళా క్రికెట్‌లో టీమిండియా తరపున ఎన్నో రికార్డులు ఆమె సొంతం. 1999లో 16 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మిథాలీ బుధవారం తన 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.

ఆమె సాధించిన రికార్డుల గురించి అందరికి తెలుసు.. కానీ ఆమెలోని మరో యాంగిల్‌ గురించి చాలా మంది తెలియదు. అంతేకాదు కెరీర్‌ అనగానే ప్రయాణం ఎప్పుడు సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు.. వివాదాలు సహజమే. అయితే మిథాలీ విషయంలో చెప్పుకునే వివాదాలు పెద్దగా లేనప్పటికి ఒకటి రెండు మాత్రం తెరమీదకు వస్తాయి. మరి మిథాలీ రాజ్‌లో మనకు తెలియని కోణాలు, వివాదాలు ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.

క్రికెటర్‌గా మాత్రమే కాదు.. గ్లామర్‌ షోతోనూ


రాజస్థాన్‌లో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగిన మిథాలీ రాజ్ క్రికెట్‌లో ఎంతో హుందాగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఆ హుందాతనం మరింతగా ఉంటుంది. అలా ఉంది కాబట్టే మహిళా క్రికెట్‌లో అనేక రికార్డులు ఆమె సొంతమయ్యాయి. మరి ఇంత  హుందాగా కనిపించే మిథాలీ రాజ్‌లో చాలా మందికి తెలియని మరో యాంగిల్ గ్లామర్‌ షో. క్రికెట్‌ మ్యాచ్‌లు లేనప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ మ్యాగజైన్లకు ఫోజులు ఇవ్వడం మిథాలీ రాజ్‌కు అలవాటు.

గ్లామర్ ఒలికించడానికి ఏ మాత్రం మొహమాటపడని మిథాలీ రాజ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చాలాసార్లు వైరల్‌గా మారాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

పుస్తక ప్రియురాలు.. మన మిథాలీ
మిథాలీ రాజ్‌కు క్రికెట్‌తో పాటు మరో మంచి అలవాటు ఉంది. అదే పుస్తక పఠనం. ఖాళీ సమయం దొరికితే చాలు పుస్తకాలను తిరగేస్తుంది. మ్యాచ్‌లు జరిగే సమయాల్లోనూ మిథాలీ తన బ్యాటింగ్‌ వచ్చేవరకు పుస్తకాలు చదువుతుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. విదేశాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే మిథాలీ రాజ్‌ తన సూట్‌కేసులో పుస్తకాలకు ప్రత్యేక చోటు కల్పిస్తుందట.

ఇంగ్లండ్‌ వేదికగా 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ సందర్బంగా మిథాలీ పుస్తకాలు చదువుతున్న ఫోటోలు తొలిసారి ప్రత్యక్షమయ్యాయి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి స్వేచ్చగా బ్యాటింగ్‌ చేయడానికి వీలుగా ఉంటుందని మిథాలీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మళ్లీ 2022 మహిళా వన్డే ప్రపంచకప్‌లోనూ అదే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్బంగా మిథాలీ తన బ్యాటింగ్‌ వచ్చేవరకు డగౌట్‌లో కూర్చొని పుస్తక పఠనం చేయడం ఆసక్తిని కలిగించింది.  

మిథాలీని చుట్టుముట్టిన వివాదాలు..
2018 టీ20 వరల్డ్‌కప్ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్ భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు.ఆ సమయంలో భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కి భారత టీ20 జట్టులో చోటు కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. తనను కావాలనే టీ20 జట్టుకి దూరం చేస్తున్నారని హెడ్ కోచ్ రమేశ్ పవార్, సీఓఏ సభ్యురాలు డయానా ఎడ్లుల్జీలపై మిథాలీ ఆరోపణలు చేసింది.

బ్యాటింగ్ ఆర్డర్‌లో తనని కింద ఆడాల్సిందిగా వాళ్లు ఒత్తిడి పెడుతున్నారని మిథాలీ అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే రమేశ్ పవార్.. మిథాలీపై రివర్స్ ఆరోపణలు చేశాడు.'' ఒక సీనియర్ ప్లేయర్‌గా జట్టు పరిస్థితిని అర్థం చేసుకుని ఆడాల్సిన మిథాలీరాజ్, బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపితే, రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని’ పేర్కొన్నాడు.

ఇక ఐర్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిథాలీజ్ 50 పరుగులు చేసి ఆదుకుంది. అయితే మిథాలీ ఇన్నింగ్స్‌లో 25 డాట్ బాల్స్ ఉండడంతో ఆమె కేవలం తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతోందంటూ రమేశ్ పవార్ విమర్శలు చేయడం ఆసక్తి రేపింది.ఈ సంఘటన తర్వాత రమేశ్ పవార్ కాంట్రాక్ట్ గడువు ముగిసి ఆ పదవి నుంచి తప్పుకోవడంతో డబ్ల్యూవీ రామన్, భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత రమేశ్ పవార్‌ను తిరిగి మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 

రమేశ్ పవార్‌తో వివాదం తర్వాత టి20 క్రికెట్ నుంచి మిథాలీరాజ్ రిటైర్మెంట్ తీసుకుంది . టి20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్, మిథాలీరాజ్ మధ్య కూడా విభేదాలున్నాయని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. నిధానంగా ఆడే మిథాలీ.. టి20ల్లో పనికి రాదని హర్మన్‌ప్రీత్ భావించేదని.. ఇదే ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమని కొన్నాళ్లు ప్రచారం జరిగింది.

చదవండి:  మిథాలీ రాజ్‌ అరుదైన రికార్డులు ఇవే! ఎవరికీ సాధ్యం కాని రీతిలో

రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top