ఐపీఎల్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌ను ఉద్దేశిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌ యజమాని భావోద్వేగ ట్వీట్‌

Mishy Bhai, DC Is Yours For Life Says Parth Jindal After Amit Mishra Goes Unsold In IPL 2022 Mega Auction - Sakshi

ఐపీఎల్‌ కెరీర్‌లో సింహ భాగం ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, లీగ్‌ చరిత్రలో మూడో అత్యధిక వికెట్‌ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు) నిలిచిన అమిత్‌ మిశ్రాను తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో ఏ జట్టు కూడా సొంతం చేసుకోకపోవడంతో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ టీమిండియా వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ను ఉద్దేశిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ యజమాని పార్థ జిందాల్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. 

ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడివైన మిశి భాయ్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ నీ సేవలకు సలాం చేస్తుంది, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ సేవలను వినియోగించుకునేందుకు డీసీ జట్టు సిద్ధంగా ఉంది, ఈ జట్టు ఎప్పటికీ నీదే అంటూ పార్థ.. ట్విటర్‌ వేదికగా ఐపీఎల్‌ దిగ్గజ స్పిన్నర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ట్విట్‌ను బట్టి చూస్తే.. డీసీ జట్టు అమిత్‌ మిశ్రా సేవలకు పరోక్షంగా వినియోగించుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో కోటి రూపాయల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో పేరును నమోదు చేసుకున్న అమిత్‌ మిశ్రాపై ఢిల్లీ సహా ఏ ఇతర ఐపీఎల్‌ జట్టు కూడా ఆసక్తి కనబర్చలేదు. మిశ్రా గతేడాది లీగ్‌లో చివరిసారిగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దర్శనమిచ్చాడు. ఆ మ్యాచ్‌లో మిశ్రా 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించకుని ఓ వికెట్‌ పడగొట్టాడు. కాగా, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో అమిత్‌ మిశ్రాతో పాటు టీమిండియా వెటరన్‌ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, ఇషాంత్‌ శర్మ, పుజారా, కేదార్‌ జాదవ్‌, హనుమ విహారిలపై కూడా ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు.  దీంతో ఈ టీమిండియా వెటరన్‌ క్రికెటర్లంతా అమ్ముడుపోని ఆటగాళ్లుగా మిగిలిపోయారు. 
చదవండి: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top