IPL 2022: "ముంబై అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది.. అందుకే ఇలా"

MI had a shocking auction says Shane Watson - Sakshi

ఐపీఎల్‌-2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్‌ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచిందని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్‌లో కూడా ముంబై విజయం సాధించలేదు. అయితే వేలంలో సరైన వ్యూహం అనుసరించలేదని టోర్నమెంట్‌ ఆరంభం నుంచే ముంబై ఇండియన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇషాన్‌ కిషన్‌ను రూ.15.25 కోట్లకు కొనుగోలు చేయడం, అదేవిధంగా ఈ ఏడాది సీజన్‌కు జోఫ్రా ఆర్చర్‌ అందుబాటులో లేనప్పటికీ  భారీ డబ్బుకు కొనుగోలు చేయడం వంటి నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.

"ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో ఉండటం నాకు ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వారు వేలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇషాన్‌ కిషన్‌ కోసం వారు చాలా మొత్తం వెచ్చించారు. కిషన్‌ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ల పర్స్‌లో ఉన్న మొత్తాన్ని అతడికే వెచ్చిండం సరైనది కాదు. ఇక జోఫ్రా ఆర్చర్ జట్టులోకి తిరిగి వస్తాడో లేదో తెలియదు. అతడు చాలా కాలంగా క్రికెట్ ఆడటంలేదు.  అతడిని కూడా భారీ ధరకు కొనుగోలు చేశారు" అని పేర్కొన్నాడు.  ఇదిలా ఉండగా, ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం(ఏప్రిల్‌16) తలపడనుంది.

చదవండి: KKR VS SRH: కేన్‌ మామ ఖాతాలో అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top