వెర్‌స్టాపెన్‌ జోరు  | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌ జోరు 

Published Mon, Jul 24 2023 3:45 AM

Max Verstappens ninth win of the season - Sakshi

బుడాపెస్ట్‌: ఫార్ములావన్‌ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ వరుసగా ఏడో విజయాన్ని, ఓవరాల్‌గా తొమ్మిదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 70 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 38 నిమిషాల 08.634 సెకన్లలో పూర్తి చేసి గెలుపొందాడు.

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన హామిల్టన్‌ను వెర్‌స్టాపెన్‌ తొలి ల్యాప్‌ మలుపు వద్ద ఓవర్‌టేక్‌ చేసి వెనుదిరిగి చూడలేదు. ఈ గెలుపుతో ఫార్ములావన్‌ చరిత్రలో వరుసగా 12 రేసుల్లో నెగ్గిన తొలి జట్టుగా రెడ్‌బుల్‌ గుర్తింపు పొందింది. 1988లో మెక్‌లారెన్‌ జట్టు వరుసగా 11 రేసుల్లో గెలిచింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement