పోలీస్‌ ఎస్కార్ట్‌ మధ్య ట్రోఫీ అందుకున్న ఫార్ములావన్‌ స్టార్‌ | Max Verstappen Gets Police Escort-To-Podium Winning 1st Miami Grand Prix | Sakshi
Sakshi News home page

Max Verstappen: పోలీస్‌ ఎస్కార్ట్‌ మధ్య ట్రోఫీ అందుకున్న ఫార్ములావన్‌ స్టార్‌

Published Mon, May 9 2022 1:54 PM | Last Updated on Mon, May 9 2022 2:09 PM

Max Verstappen Gets Police Escort-To-Podium Winning 1st Miami Grand Prix - Sakshi

ఫార్ములావన్‌ స్టార్‌.. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు అరుదైన గౌరవం లభించింది. సోమవారం జరిగిన మియామి గ్రాండ్‌ప్రిక్స్‌ ఫైనల్‌ ల్యాప్‌ రేసులో వెర్‌స్టాపెన్‌ సూపర్‌ విక్టరీ సాధించాడు. మొదట మూడో పొజిషన్‌లో నిలిచినప్పటికి ఆ తర్వాత ఫెరారీ డ్రైవర్లు చార్లెస్‌ లెక్లెర్క్‌, కార్లోస్‌ సెయింజ్‌లను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచాడు. మొదటి ల్యాప్‌ను మూడో స్థానంతో ప్రారంభించి చివరకు రెండో స్థానంతో పొజిషన్‌ను ముగించాడు. ఆ తర్వాత ఏడు ల్యాప్స్‌ అనంతరం పోల్‌ పొజిషన్‌ సాధించిన వెర్‌స్టాపెన్‌ దూసుకెళ్లి రేసు గెలవడంతో పాటు టైటిల్‌ను కొల్లగొట్టాడు.

కాగా మియామి ఓపెన్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ తొలిసారి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజేతకు గౌరవం ఇవ్వాలని పోడియం వరకు మేనేజ్‌మెంట్‌ పోలీస్‌ ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముందు, వెనుక పోలీస్‌ ఎస్కార్ట్‌ వెళ్లగా.. మధ్యలో ఓపెన్‌ టాప్‌ కార్‌లో వెర్‌స్టాపెన్‌ పోడియం వద్దకు చేరుకొని ట్రోఫీని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

''ఈ గెలుపును ఇప్పటికి నమ్మలేకపోతున్నా. నిజంగా ఇది మంచి కమ్‌బ్యాక్‌. వాస్తవానికి నాకు మంచి ఆరంభం లభించలేదు. ఆ తర్వాత ఫుంజుకొని తొలి స్థానంతో రేస్‌ను ముగించాను. మధ్యలో సెయింజ్‌ నుంచి గట్టిపోటి ఎదురైనప్పటికి  టర్న్‌ 1 నుంచి అతన్ని దాటాలనే ప్రయత్నం చేశాను. లక్కీగా అది వర్కవుట్‌ అయింది. ఇక మెయిడెన్‌ టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది'' అంటూ ట్రోఫీ అందుకున్న అనంతరం వెర్‌స్టాపెన్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: దిగ్గజాలకు షాకిచ్చి మాడ్రిడ్‌ ఓపెన్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్‌ యువ కెరటం

Avinash Sable: 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement