దిగ్గజాలకు షాకిచ్చి మాడ్రిడ్‌ ఓపెన్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్‌ యువ కెరటం

Carlos Alcaraz Wins Madrid Open To Claim Fourth Title Of 2022 - Sakshi

మాడ్రిడ్‌: స్పెయిన్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారుడు కార్లోస్‌ అల్కరాజ్‌ (19) మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌1000 టైటిల్‌ను నెగ్గి చరిత్ర సృష్టించాడు. క్వార్టర్స్‌లో తన ఆరాధ్య ఆటగాడు రఫెల్‌ నదాల్‌ను, సెమీస్‌లో టాప్‌ ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌లను ఓడించిన ఈ యువ సంచలనం.. ఫైనల్లో 6-3, 6-1తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, వరల్డ్‌ నంబర్‌ 3 ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను చిత్తు చేసి సీజన్‌లో నాలుగో టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. 

ఈ క్రమంలో అల్కరాజ్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సీజన్‌లో నదాల్‌ (2005) తర్వాత రెండు మాస్టర్స్‌ 1000 టైటిళ్లు నెగ్గిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. అల్కరాజ్‌ ఇప్పటికే టాప్‌ 10లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. మాడ్రిడ్‌ ఓపెన్‌లో విజయం సాధించిన అనంతరం జ్వెరెవ్.. అల్కరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అల్కరాజ్‌ను భవిష్యత్తు సూపర్‌ స్టార్‌గా అభివర్ణించాడు. చిన్న వయసులోనే దిగ్గజాలందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్న అల్కరాజ్‌.. మున్ముందు అనేక గ్రాండ్ స్లామ్‌లు సాధించాలని ఆకాంక్షించాడు. 
చదవండి: గుకేశ్‌ ఖాతాలో ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top