దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) బ్లిట్జ్ చాంపియన్ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ చాంపియన్ షిప్‌లో అతను ర్యాపిడ్ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కార్ల్‌సన్ 2.5–1.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్‌పై విజయం సాధించాడు. తుది పోరు తొలి గేమ్‌లో ఓడిన అనంతరం కోలుకున్న కార్ల్‌సన్ రెండో గేమ్‌ను గెలుచుకున్నాడు. మూడో గేమ్ ‘డ్రా’గా ముగియగా...నాలుగో గేమ్‌లో నల్లపావులతో ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అసాధారణ కెరీర్‌లో కార్ల్‌సన్ అన్ని ఫార్మాట్‌లు కలిపి 20వ సారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. 2025లో మొత్తంగా కార్ల్‌సన్ 10 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో బిబిసార అసౌబయెవా (కజకిస్తాన్) బ్లిట్జ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 2.5–1.5 తేడాతో అనా ముజిచుక్ (ఉక్రెయిన్)ను ఓడించింది. 21 ఏళ్ల బిబిసార వరల్డ్ బ్లిట్జ్‌లో విజేతగా నిలవడం ఇది మూడో సారి కావడం విశేషం.


