
రియాద్: తొలిసారి నిర్వహించిన ఈ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్ చెస్ టోర్నమెంట్‌లో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ చాంపియన్‌గా అవతరించాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన ఫైనల్లో కార్ల్‌సన్ 3–1, 3–1తో విజయం సాధించాడు.
సెట్–1లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్‌సన్ రెండు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. సెట్–2లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్‌సన్ మూడు గేముల్లో నెగ్గి, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. హికారు నకముర (అమెరికా) మూడో స్థానం పొందగా... భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ స్టార్ ఇరిగేశి అర్జున్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.
నకమురతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో అర్జున్ 2.5–3.5తో ఓడిపోయాడు. ఐదు గేముల్లో అర్జున్ రెండింటిలో గెలిచి, ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు 2,50,000 డాలర్లు (రూ. 2 కోట్ల 18 లక్షలు) లభిస్తాయి.
రెండో స్థానం పొందిన అలీరెజాకు 1,90,000 డాలర్లు (రూ. 1 కోటీ 65 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన నకమురకు 1,45,000 డాలర్లు (రూ. 1 కోటీ 26 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన అర్జున్‌కు 1,15,000 డాలర్లు (రూ. 1 కోటీ 33 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.