అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు | LSG Owner Sanjiv Goenka-Rishabh Pant And Team Visit Ayodhya | Sakshi
Sakshi News home page

IPL 2026: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు

Mar 21 2026 8:28 PM | Updated on Mar 21 2026 8:33 PM

LSG Owner Sanjiv Goenka-Rishabh Pant And Team Visit Ayodhya

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు మరో వారం రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది.  ఈ నేపథ్యంలో టోర్నీ సన్నద్ధతకు ముందు అయోధ్యలోని రామజన్మ భూమిని దర్శించుకుంది. 

శనివారం కెప్టెన్ రిషభ్ పంత్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా సహా క్రికెటర్లు అయోధ్య బాలరాముడి దీవెనలు అందుకున్నారు. ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఘనంగా ఆరంభించాలని రాముడిని కోరుకుంటున్నట్లు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది.ఈ సందర్భంగా శనివారం తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.

‘రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ.. మా జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి’ అని సంజీవ్ గొయెంకా ఏఎన్‌ఐతో తెలిపాడు.

ఐపీఎల్‌లో మూడుసార్లు ఫ్లే ఆఫ్స్‌ వరకూ పరిమితమైన లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆరే విజయాలతో నాకౌట్‌కు ముందే నిష్క్రమించింది. అయితే.. ఈసారి కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో మైదానంలో చెలరేగిపోవాలనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 11న మ్యాచ్‌తో లక్నో టోర్నీలో అడుగు పెట్టనుంది.

Advertisement
 
Advertisement
Advertisement