స్టువర్ట్‌ బిన్నీ ఊచకోత.. రిచర్డ్‌ లెవి విధ్వంసం | Legends Cricket Trophy 2023: Vizag Titans Beat Nagpur Ninjas By 1 Run | Sakshi
Sakshi News home page

Legends Cricket Trophy 2023: స్టువర్ట్‌ బిన్నీ ఊచకోత.. సరిపోని రిచర్డ్‌ లెవి మెరుపులు

Mar 25 2023 12:48 PM | Updated on Mar 25 2023 1:09 PM

Legends Cricket Trophy 2023: Vizag Titans Beat Nagpur Ninjas By 1 Run - Sakshi

లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్‌ టైటాన్స్‌, నాగ్‌పూర్‌ నింజాస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఆధ్యంతం​ ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్‌ టైటాన్స్‌ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్‌ కాంప్టన్‌ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్‌), మల్కన్‌ సింగ్‌ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్‌ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్‌ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు.

అనంతరం బరిలోకి దిగిన నింజాస్‌ రిచర్డ్‌ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్‌ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్‌ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్‌ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్‌లో నింజాస్‌ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్‌ అద్భుతంగా బౌల్‌ చేసిన స్టువర్ట్‌ బిన్నీ.. హర్భజన్‌ సింగ్‌ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్‌ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement