టీమిండియా హెడ్‌ కోచ్‌గా లక్ష్మణ్‌.. ద్రవిడ్‌కు త్వరలోనే గుడ్‌బై!

Laxman likely to replace Dravid as India head coach after 2023 ODI Wc says Reports - Sakshi

స్వదేశంలో ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత  టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీయస్‌ లక్ష్మణ్‌ను నిమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది.

ఈ క్రమంలో ద్రవిడ్‌ ప‌ద‌వీ కాలన్ని పెంచే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా గతేడాది జరిగిన ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం తర్వాత ద్రవిడ్‌ను హెడ్‌ కోచ్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో భారత- ఏ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్‌ అత్యంత విజయవంతమయ్యాడు.  అదే విధంగా రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో భారత సీనియర్‌ జట్టుకు తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా కూడా వీవీయస్‌ బాధ్యతలు నిర్వర్తించాడు.

గతేడాది జరిగిన ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో లక్ష్మణ్‌ తొలి భారత హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం జింబాబ్వేతో వన్డే సిరీస్‌, న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లో కూడా భారత జట్టు ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్‌ పనిచేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ మినహా.. మిగితా అన్ని సిరీస్‌లో భారత్‌ విజయం సాధించింది. ఇక​ లక్ష్మణ్‌ ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీ డైరెక్టర్‌గా ఉన్నాడు.
చదవండి: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top