బ్యాడ్మింటన్‌లో భార‌త్ శుభారంభం.. రెండో రౌండ్‌కు చేరిన ల‌క్ష్య‌సేన్‌ | Lakshya Sen in Paris Olympics 2024, saves 4 game points to beat Kevin Cordon | Sakshi
Sakshi News home page

Paris Olympics: బ్యాడ్మింటన్‌లో భార‌త్ శుభారంభం.. రెండో రౌండ్‌కు చేరిన ల‌క్ష్య‌సేన్‌

Jul 27 2024 9:47 PM | Updated on Jul 27 2024 10:00 PM

 Lakshya Sen in Paris Olympics 2024, saves 4 game points to beat Kevin Cordon

ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భార‌త్‌కు శుభారంభం ద‌క్కింది. మెన్స్ సింగిల్స్​ గ్రూప్​ స్టేజ్​ తొలి మ్యాచ్‌లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ లక్ష్యసేన్  అద‌ర‌గొట్టాడు. శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో గ్వాటెమాల ష‌ట్ల‌ర్‌ కెవిన్ కోర్డాన్‌పై 21-08, 22-20 తేడాతో  విజ‌యం సాధించిన లక్ష్యసేన్.. త‌దుప‌రి రౌండ్‌కు ఆర్హ‌త సాధించాడు.

తొలి సెట్‌ను అల‌వోక‌గా ద‌క్కించుకున్న ల‌క్ష్య‌సేన్‌కు రెండో సెట్‌లో మాత్రం కెవిన్‌ నుంచి గ‌ట్టిపోటీ ఎదురైంది. అయితే ఏమాత్రం ప‌ట్టువిడ‌వ‌ని ల‌క్ష్య‌సేన్ రెండో రౌండ్‌లోనూ ప్ర‌త్య‌ర్ధిని మ‌ట్టిక‌రిపించాడు. జులై 29న గ్రూప్ స్టేజ్​లో రెండో మ్యాచ్​ ల‌క్ష్య‌సేన్ ఆడ‌నున్నాడు. ల‌క్ష్య‌సేన్‌కు ఇదే ఇవే తొలి ఒలింపిక్స్ క్రీడ‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

సాత్విక్- చిరాగ్  బోణీ..
మ‌రోవైపు బ్యాడ్మింటన్ డబుల్స్​ గ్రూప్ స్టేజ్​లో కూడా భార‌త్ బోణీ కొట్టింది. గ్రూపు స్టేజి తొలి మ్యాచ్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్, చిరాగ్‌లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. వ‌రుస సెట్ల‌లో 21-17, 21-14 తేడాతో ఫ్రాన్స్ జంట లూకాస్ కార్వీ, రోనన్ లాబర్‌పై సాత్విక్, చిరాగ్ ఘ‌న విజ‌యం సాధించారు. ఈ విజ‌యంతో రెండో రౌండ్‌లో ఈ జంట అడుగుపెట్టింది. జులై 29న గ్రూప్ స్టేజ్​లో రెండో మ్యాచ్​ సాత్విక్‌-చిరాగ్ ఆడ‌నున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement