
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పల్లెకలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మెండిస్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో మెండిస్ 95 బంతుల్లో తన ఆరో వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యా టర్ సహచర ఆటగాళ్లు పాథుమ్ నిస్సాంక, చరిత్ అసలంకతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
ఓవరాల్‌గా 114 బంతులు ఎదుర్కొన్న మెండిస్.. 18 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో శ్రీలంక క్రికెటర్‌గా మెండిస్ నిలిచాడు. కుశాల్ ఇప్పటివరకు బంగ్లాపై మూడు ఫార్మాట్లు కలిపి 2032 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర(3090) అగ్రస్దానంలో ఉన్నాడు.
బంగ్లాదేశ్‌పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన శ్రీలంక ఆటగాళ్లు వీరే
కుమార్ సంగక్కర – 3090
కుసాల్ మెండిస్ - 2032
దిల్షాన్ - 1903
మహేల జయవర్ధనే - 1723
ఉపుల్ తరంగ – 1507
బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్‌తో పాటు నిస్సాంక(35), అసలంక(58) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, మెహాదీ హసన్ మిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీమ్, తన్వీర్, షకీబ్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?