Kraigg Brathwaite: అత్యధిక టెస్టు వికెట్లతో విండీస్‌ కెప్టెన్‌ కొత్త రికార్డు?!

Kraigg Brathwaite Record Most Test Wickets Without Dismiss Same Man Twice - Sakshi

క్రికెట్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ కొత్త రికార్డు సృష్టించాడు. అదేంటి టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ తొలి స్థానంలో ఉన్నాడు.. మరి క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ ఎక్కడినుంచి వచ్చాడు అని కంగారు పడకండి. టెస్టుల్లో ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్‌ చేయకుండా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రాత్‌వైట్‌ నిలిచాడు. 

విషయంలోకి వెళితే.. బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ పేరు సంపాదించిన బ్రాత్‌వైట్‌ ఇప్పటివరకు 77 టెస్టుల్లో 25 వికెట్లు తీశాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ 25 వికెట్లు 25 బ్యాట్స్‌మెన్లవి. దీనర్థం ఏంటంటే.. బ్రాత్‌వైట్‌ తాను సాధించిన 25 వికెట్లలో ఒ‍క్కaటి కూడా రిపీట్‌ కాలేదని. సాధారణంగా ఒక బౌలర్‌ ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్‌ చేస్తుంటాడు. చాలా సందర్బాల్లో బౌలర్లకు తొలి 25 వికెట్లలోనే ఆ రిపీట్‌ బ్యాట్స్‌మన్‌ కనబడ్డారు.

కానీ బ్రాత్‌వైట్‌ మాత్రం తాను తీసిన 25 వికెట్లు కొత్తవే కావడం విశేషం. ఇలా చూసుకుంటే ఇది రికార్డు కిందకే వస్తుంది. ఇంతకముందు ఈ రికార్డు బంగ్లాదేశ్‌ బౌలర్‌ మహ్మద్‌ అష్రాఫుల్ పేరిట ఉండేది. అష్రాఫుల్‌ తాను ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్‌ చేయకముందు 21 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్‌ అష్రాఫుల్‌ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక శ్రీలంక బౌలర్‌ సజీవ డిసిల్వా కూడా తాను తీసిన 16 వికెట్లతో ఒక్క రిపీట్‌ బ్యాట్స్‌మన్‌ కూడా లేకపోవడం విశేషం.

ఇక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్‌( 133 టెస్టుల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌(145 టెస్టుల్లో 708 వికెట్లు) రెండో స్థానంలో..  ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌(169 టెస్టుల్లో 640 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(132 టెస్టుల్లో 619 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు.  

చదవండి: Virat Kohli: వరుసగా ఐదో ఏడాది ఇండియాస్‌ మోస్ట్‌ వాల్యుబుల్ సెలెబ్రిటీగా విరాట్‌ కోహ్లి

IPL 2022: 'అతడు ఫుల్‌ ఫిట్‌గా ఉన్నాడు.. ప్రపంచకప్‌ భారత జట్టులో చోటు ఖాయం'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top