IND VS BAN 1st Test: ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ అప్రోచ్‌పై ప్రశంసలు కురిపించిన టీమిండియా కెప్టెన్‌

KL Rahul Backs England Bazball Batting Approach In Tests - Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ అనుసరిస్తున్న బజ్‌బాల్‌ విధానంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ అనుసరిస్తున్న వ్యూహాన్ని అతను ఆకాశానికెత్తాడు. ఇంగ్లండ్‌ క్రికెటర్లు దూకుడగా ఆడుతు​న్న విధానాన్ని కొందరు నిర్లక్షపు క్రికెట్‌ అని పేర్కొనడాన్ని తప్పుబట్టాడు. 

టెస్ట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ క్రికెటర్ల అప్రోచ్‌ సరైందేనని, వాళ్లు నిర్భయంగా, దూకుడుగా ఆడుతున్న విధానాన్ని ప్రతి క్రికెట్‌ అభిమాని అమితంగా ఇష్టపడుతున్నాడని పేర్కొన్నాడు. టెస్ట్‌ క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్న తరుణంలో బజ్‌బాల్‌ అప్రోచ్‌ చాలా మార్పులు తెచ్చిందని, వ్యక్తిగతంగా ఇది తనను కూడా బాగా ఆకట్టుకుందని తెలిపాడు. 

ఇంగ్లండ్‌ క్రికెటర్ల అటాకింగ్‌ స్టైల్‌ చాలా బాగుంటుందని, బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో తాము కూడా ఇంగ్లండ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తామని ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అన్నాడు. కాగా, రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ ఎంపికైన విషయం తెలిసిందే.  

ఇదిలా ఉంటే, 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టు.. బజ్‌బాల్‌ విధానాన్ని అనుసరించి మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను స్టోక్స్‌ సేన తమదైన దూకుడు స్టైల్‌లో ఆడి 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితం తేలదనుకున్న మ్యాచ్‌లో (తొలి టెస్ట్‌) సైతం ఇంగ్లండ్‌ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడి గెలిచారు. గత కొంతకాలంగా ఇంగ్లండ్‌ ఇదే విధానాన్ని అనుసరించి వరుస విజయాలు సాధిస్తుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top