16 ఏళ్ల క్రికెట‌ర్‌కు బంప‌రాఫ‌ర్‌.. ఐపీఎల్‌లో ఎంట్రీ! ఎవ‌రంటే? | KKR sign 16-year old Afghan spinner Allah Ghazanfar | Sakshi
Sakshi News home page

IPL 2024: 16 ఏళ్ల క్రికెట‌ర్‌కు బంప‌రాఫ‌ర్‌.. ఐపీఎల్‌లో ఎంట్రీ! ఎవ‌రంటే?

Mar 28 2024 9:22 PM | Updated on Mar 29 2024 8:34 AM

KKR sign 16-year old Afghan spinner Allah Ghazanfar - Sakshi

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆట‌గాడు, అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్న‌ర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం కార‌ణంగా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. తాజాగా అత‌డి స్ధానాన్ని అఫ్గానిస్తాన్ యువ స్పిన్న‌ర్‌ అల్లాహ్‌ ఘజన్‌ఫర్‌తో కేకేఆర్ ఫ్రాంచైజీ భ‌ర్తీ చేసింది.  16 ఏళ్ల ఘజన్‌ఫర్‌ను రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌కు కోల్‌క‌తా సొంతం చేసుకుంది.  

ఘజన్‌ఫర్ ఇటీవ‌లే ఐర్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌తో అఫ్గానిస్తాన్ త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అత‌డు కేకేఆర్ త‌రపున క్యాప్ అందుకుంటే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల‌కెక్కుతాడు. మ‌రోవైపు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సైతం ప్రసిద్ధ్‌ కృష్ణ స్ధానాన్ని భ‌ర్తీ చేసింది.  

అతడి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్‌ మహరాజ్‌ను యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కార‌ణంగా ప్ర‌సిద్ద్ ఈ ఏడాది సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు. అశ్విన్‌,చాహ‌ల్‌కు బ్యాక‌ప్ స్పిన్న‌ర్‌గా మ‌హారాజ్ ఉండ‌నున్నాడు. కేశవ్ మ‌హారాజ్‌ ఇప్పటి వరకు 27 టీ20లు, 44 వన్డేలు, 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 237 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్‌ యాజమాన్యం అతడిని రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement