Hardik Pandya: హార్దిక్‌ పాండ్యాను ఆల్‌రౌండర్‌గా పిలవడం వ్యర్థం

Kapil Dev Says Stop Calling Hardik Pandya As All Rounder He Cant Bowl - Sakshi

Kapil Dev Dismisses All-rounder Tag For Hardik Pandya.. టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యాపై మాజీ దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. '' హార్దిక్‌ పాండ్యాను ఆల్‌రౌండర్‌ అని పిలవడం ఆపేయండి.. బౌలింగ్‌ చేయనప్పుడు అతనికి ఆ ట్యాగ్‌ వ్యర్థం.. వెంటనే తొలగించండి. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన హార్దిక్‌ బౌలింగ్‌ చేయడం ఒక్కసారి కూడా చూడలేదు. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతను బౌలింగ్‌ చేయాలి. కానీ అలా చేయడం లేదు. ఇది ఇలాగే ఉంటే బౌలింగ్‌ పూర్తిగా చేయడం మరిచిపోతాడు. ఇకముందు హార్దిక్‌ బౌలింగ్‌ చేయాలంటే చాలా మ్యాచ్‌ల్లో ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: IND vs NZ 1st Test: 'పాకిస్తాన్‌ ముర్దాబాద్‌'.. స్టేడియంలో ఫ్యాన్స్‌ అరుపులు

ఇక  కొంతకాలంగా ఫామ్‌ లేక తంటాలు పడుతున్న హార్దిక్‌ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్‌ దానిని నిలుపుకోలేకపోయాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్‌ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బౌలింగ్‌ చేశాడు. ఆల్‌రౌండర్‌ అంటేనే అన్ని విభాగాల్లో తన వంతు సాయం అందించాలి. కానీ ఇవేమీ చేయకపోగా జట్టుకు భారంగా మారాడు. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన పాండ్యా ప్రస్తుతం రీహాబిటేషన్‌ కోసం ఎన్‌సీఏకు వెళ్లాడు. 

చదవండి: Shreyas Iyer: దిగ్గజాల సరసన శ్రేయాస్‌ అయ్యర్‌.. 16వ ఆటగాడిగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top