ఉతికి ఆరేసిన బట్లర్‌.. మెరిసిన సాల్ట్‌

Jos Buttler Smashed His First Fifty Of The Hundred Season - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా లండన్‌ స్పిరిట్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ చెలరేగి ఆడాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు పూనకం వచ్చినట్లు ఊగిపోయిన బట్లర్‌.. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది, రవి బొపారా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

మరో ఎండ్‌లో ఫిలిప్‌ సాల్ట్‌ (9 బంతుల్లో 21; 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో ఒరిజినల్స్‌ 80 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. ఒరిజినల్స్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌, సాల్ట్‌తో పాటు మ్యాక్స్‌ హోల్డన్‌ (24; 3 ఫోర్లు) రాణించగా.. లారీ ఈవాన్స్‌ (1), పాల్‌ వాల్టర్‌ (2) నిరాశపరిచారు. ఆస్టన్‌ టర్నర్‌ (16), జేమీ ఓవర్టన్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

లండన్‌ బౌలర్లలో రవి బొపారా 2 వికెట్లు పడగొట్టగా.. డేనియల్‌ వార్రెల్‌, లియామ్‌ డాసన్‌, మాథ్యూ క్రిచ్లీ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, హండ్రెడ్‌ లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌లో బట్లర్‌కు ఇది తొలి హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. బట్లర్‌ ఫామ్‌లోని రావడంతో అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. బట్లర్‌ ఇలాగే భారీ షాట్లు ఆడుతూ తమను అలరించాలని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో బట్లర్‌ ఆడిన భారీ షాట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top