
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) ఫ్రాంచైజీ గల్ఫ్ జెయింట్స్ తమ కోచింగ్ బృందంలో సమూల ప్రక్షాళన చేపట్టింది. వచ్చే సీజన్ కోసం హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ పదవుల్లో కొత్త వారిని నియమించుకుంది.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టిన జింబాబ్వే మాజీ బ్యాటర్ ఆండీ ఫ్లవర్ గత ILT20 సీజన్‌లో గల్ఫ్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆండీ ఫ్లవర్ పర్యవేక్షణలో జెయింట్స్ గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది. 10 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
దీంతో జెయింట్స్ యాజమాన్యం ఆండీ ఫ్లవర్‌పై వేటు వేసి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది.
అలాగే గత సీజన్‌లో జెయింట్స్ కోచింగ్ బృందంలో పని చేసిన ఒట్టిస్ గిబ్సన్, రిచర్డ్ హల్సాల్, గ్రాంట్ ఫ్లవర్, గ్యారీ బ్రెంట్ స్థానాల్లో బ్యాటింగ్ కోచ్‌గా ఆండ్రూ పుట్టిక్, బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్‌గా జేమీ ట్రఫ్టన్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా నికోలస్ లీను నియమించుకుంది.
తమ కోచింగ్ బృందంలో సమూల ప్రక్షాళన చేసిన విషయాన్ని గల్ఫ్ జెయింట్స్ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 25) సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. గల్ఫ్ జెయింట్స్ మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్‌కు సిస్టర్ ఫ్రాంచైజీ.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ అరంగేట్రం ఎడిషన్‌లో (2023) ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత గల్ఫ్ జెయింట్స్ వరుసగా రెండు ఎడిషన్లలో చెత్త ప్రదర్శన చేసింది. 2024 ఎడిషన్‌లో మూడో స్థానంలో, 2025 ఎడిషన్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ లీగ్ వచ్చే ఎడిషన్ 2026 జనవరి తొలి అర్ద భాగంలో ప్రారంభమవుతుంది.